'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్

by Pulgam srinivas |

సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని చిత్రాన్ని ఏప్రిల్ 3వ తేదీ నుండి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నారు.

సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్
X

దిశ, వెబ్ డెస్క్: శివాజీ-లయ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' చిత్రం ఓటీటీ ఎంట్రీకి రెడీ అయింది. ఈ సినిమా యొక్క డిజిటల్ హక్కులను ఈటీవీ విన్ సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ చిత్రాన్ని ఏప్రిల్ 3వ తేదీ నుండి స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ విషయాన్ని ఈటీవీ సంస్థ వారు అధికారికంగా ప్రకటించారు. మొదట ఈ చిత్రాన్ని నేరుగా ఈటీవీ విన్ ఓటీటీలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

కానీ ఆ తర్వాత ఈ చిత్రాన్ని మార్చ్ 6న థియేటర్లలో విడుదల చేశారు. బాక్స్ ఆఫీస్ వద్ద ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయినా, ఈ చిత్రం ఓటీటీలో ఏ మేర సత్తా చాటుతుందో చూడాలి. ఈ చిత్రంలో శివాజీ నటించడం మాత్రమే కాకుండా శ్రీ శివాజీ ప్రొడక్షన్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మించాడు. సుధీర్ శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి రంజిన్ రాజ్ స్వరాలు అందించారు. ప్రిన్స్, అలీ, ధనరాజ్, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ తదితరులు ఇందులో ముఖ్య పాత్రల్లో నటించారు.

Next Story