- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Samantha: సమంతకు ఊహించని షాక్.. అయ్యో పాపం ఎంత కష్టం వచ్చిందంటున్న నెటిజన్లు!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) అందరికీ సుపరిచితమే.

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) అందరికీ సుపరిచితమే. ఈ అమ్మడు ‘ఏమాయ చేసావే’ (Ye Maaya Chesave)సినిమాతో ఇండస్ట్రీకి వచ్చి.. టాలీవుడ్ స్టార్స్ అందరి సరసన నటించి ఇండస్ట్రీని షేక్ చేసింది. ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన ఆమె కొద్ది కాలం పాటు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా రాణించింది. కానీ సడెన్‌గా మయోసైటీస్ వ్యాధి బారిన పడటంతో సినిమాలకు దూరం అయింది. ఇక చివరగా ‘ఖుషి’ మూవీలో నటించింది. ఇటీవల ‘సిటాడెల్: హనీ, బన్నీ’(Citadel: Honey Bunny) వెబ్‌సిరీస్ ద్వారా ప్రేక్షకులను అలరించిన ఆమె ఎలాంటి ప్రాజెక్ట్ ప్రకటించలేదు. కానీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ పలు పోస్టులు పెడుతోంది. ఇక ఆమె అభిమానులు మాత్రం ఎప్పుడెప్పుడు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో సమంత ‘మా ఇంటి బంగారం’ మూవీ ప్రకటించింది కానీ ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్‌లో ‘రక్త్ భ్రమండ్’ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నట్లు సమాచారం.
రహి అనిల్ బర్వే తెరకెక్కిస్తున్న ఈ సిరీస్‌లో ఆదిత్య రాయ్ కపూర్, వామిక గబ్బీ కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే ఈ సిరీస్‌పై నెట్‌ఫ్లిక్స్ ఊహించని విధంగా బడ్జెట్‌ను ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న సామ్ కూడా దీనిపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఈ క్రమంలో.. ‘రక్త్ భ్రమండ్’ బిగ్ స్కామ్‌లో చిక్కుకోవడంతో సమంతకు ఊహించని షాక్ తగిలినట్లు అయింది. అయితే 2024 సెప్టెంబర్‌లో షూటింగ్ మొదలెట్టగా.. కీలక దశకు చేరుకోకుండానే 50 శాతం బడ్జెట్ ఖర్చు అయినట్లు టాక్. దీంతో కోట్ల స్కామ్ జరిగినట్లు తెలుసుకున్న టీమ్ దాని వెనుక ఒక ఎగ్జిక్యూటిక్ ప్రొడ్యూసర్ ఉన్నట్లు గుర్తించారు. దీంతో షూటింగ్ కొంత గ్యాప్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక మయోసైటీస్ నుంచి పూర్తి కోలుకోలేని సమంత మళ్లీ ఇండస్ట్రీలో రాణించే ప్రయత్నం చేస్తుండగా. ఈ క్రమంలో ఇలా జరగడంతో ఆమె ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. అయ్యో పాపం ఎంత కష్టం వచ్చిందో ఆరోగ్యం బాలేకపోయినా నటిస్తుంటే ఇలా జరిగిందని చర్చించుకుంటున్నారు.






