వాయిదా కన్ఫర్మ్! విచారం వ్యక్తం చేస్తున్నా సమంత ఫ్యాన్స్

by Chukka Sudharani |

స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘మా ఇంటి బంగారం’.

వాయిదా కన్ఫర్మ్! విచారం వ్యక్తం చేస్తున్నా సమంత ఫ్యాన్స్
X

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘మా ఇంటి బంగారం’. తన సొంత బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక మూవీకి నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తుంది. ఓ బేబి హిట్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న ఈ చిత్రంపై ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకుల్లో పాజిటివ్ అభిప్రాయాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని మే 15న విడుదల చేస్తామని చిత్ర బృందం గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా విడుదల తేదీ మారినట్లు ఫిలిమ్ సర్కిల్‌గా గుసగుసలు వినిపిస్తున్నాయి. మే 15న వేరే చిత్రం రిలీజ్‌కు ఉండగా.. ఈ చిత్రాన్ని పోస్ట్ పోన్ చేశారట. అంతే కాకుండా.. రిలీజ్ సమయం దగ్గరలోనే ఉండగా.. ఎలాంటి ప్రమోషన్స్, హడావిడి లేకపోవడంతో ఈ మూవీ మాక్సిమమ్ వాయిదా పడిందని విశ్లేషకులు భావిస్తున్నారు. మిరి కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది త్వరలోనే ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతో సమంత ఫ్యాన్స్ నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.

Next Story