- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హ్యాపీ బర్త్‌డే మై ఎ ప్లస్ అంటూ అతనికి విష్ చేసిన సమంత.. హార్ట్ సింబల్ జోడించడంతో ఇంట్రెస్టింగ్‌గా మారిన పోస్ట్
స్టార్ హీరోయిన్ సమంత(Samantha) ప్రస్తుతం ‘రక్త బ్రహ్మాండ్’(Rakth Brahmand) అనే మూవీలో యాక్ట్ చేస్తుంది.

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ హీరోయిన్ సమంత(Samantha) ప్రస్తుతం ‘రక్త బ్రహ్మాండ్’(Rakth Brahmand) అనే మూవీలో యాక్ట్ చేస్తుంది. మరోపక్క నిర్మాతగా మారి సినిమాలు కూడా నిర్మిస్తుంది. అలా ప్రొడ్యూసర్‌గా ‘శుభం’(Shubham) అనే చిత్రాన్ని నిర్మించింది. ఇక మే 9న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ మంచి టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం జియో హాట్ స్టార్(Jio Hotstar)లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక సమంత నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ తన వ్యక్తిగత విషయాలతో పాటు లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది.
ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మ ఇన్‌స్టా(Instagram) స్టోరీ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా సామ్ హీరో కమ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్(Rahul Ravindran) ఫొటో షేర్ చేస్తూ.. ‘హ్యాపీ బర్త్‌డే మై ఎ ప్లస్ ఫ్రెండ్.. నువ్వు నాకు ఎప్పుడూ బెస్టే.. లవ్ యు ఫర్ ఎవర్ అండ్ ఎవర్’ అనే క్యాప్షన్ రాసుకొస్తూ లవ్ సింబల్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారగా.. నెటిజన్లు రాహుల్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.






