విడాకుల పై సంచలన కామెంట్స్ చేసిన సమంత.. డివోర్స్ తీసుకోవడం చాలా బాధగా అనిపించిందంటూ..

by Gugulothu.Kavitha |

స్టార్ హీరోయిన్ సమంత(Samantha) ‘ఏమాయ చేసావే’(Ye Maya Chesave) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. ఆ మూవీలో హీరోగా నటించిన అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya)తో ప్రేమలో పడింది.

విడాకుల పై సంచలన కామెంట్స్ చేసిన సమంత.. డివోర్స్ తీసుకోవడం చాలా బాధగా అనిపించిందంటూ..
X

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ సమంత(Samantha) ‘ఏమాయ చేసావే’(Ye Maya Chesave) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. ఆ మూవీలో హీరోగా నటించిన అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya)తో ప్రేమలో పడింది. అలా కొన్నేళ్లు ప్రేమించుకున్న వీరు.. ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే మ్యారేజ్ అయిన 4సంవత్సరాలకే ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి విడాకులు తీసుకున్నారు. ఇక డివోర్స్ తర్వాత చైతన్య.. స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళ(Shobhitha Dulupala)తో డేటింగ్‌లో ఉంటూ డిసెంబర్ 4న పెళ్లి చేసుకున్నాడు. కానీ, సమంత మాత్రం మరో పెళ్లి చేసుకోలేదు. అంతేకాకుండా మయోసైటీస్ అనే మహమ్మారి బారిన పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది.

రీసెంట్‌గా ‘సిటాడెల్: హనీ బన్నీ’(Citadel: Honey Bunny) అనే వెబ్ సిరీస్‌తో మన ముందుకు వచ్చి ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం నెట్టింట యాక్టీవ్‌గా ఉంటూ హెల్త్ టిప్స్ ఇస్తూ అభిమానులను పెంచుకుంటుంది. అయితే ఇప్పటి వరకు డివోర్స్ గురించి డైరెక్ట్‌గా మాట్లాడని సమంత ఫర్ ది ఫస్ట్ టైం విడాకుల గురించి సంచలన కామెంట్స్ చేసింది. ప్రజెంట్ ఆమె చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సామ్ మాట్లాడుతూ.. ‘విడాకులు తీసుకున్న మహిళను సమాజం ఎలా చూస్తుందో నాకు బాగా తెలుసు.

చాలా ఏళ్లు నేను దీంతో జీవించాను. నా గురించి ఎన్నో అబద్ధాలు పుట్టించారు. చాలా సార్లు అందులో నిజం లేదు అని చెప్పాలనిపించింది, కానీ నన్ను ఆపింది ఏమిటంటే.. నేనే. అవును నాతో నేనే మాట్లాడుకునేది. ఒకరి జీవితం గురించి కథలుగా చెప్పాలని మీరు ఉత్సాహంగా ఉండొచ్చు. కానీ దాని నుండి ఏమి పొందుతారు..? అప్పటి వరకు మీకది ఆనందం ఇస్తుండోచ్చేమో ఆ తర్వాత, మీరు ఎంత తెలివి తక్కువ పని చేశారో మీకే అర్థం అవుతుంది. అప్పుడు మిమ్మల్ని మీరే ద్వేషించుకుంటారు.

ఒకటి మాత్రం కచ్చితంగా చెప్పగలను విడాకులు తీసుకోవడం మొదట బాధగా అనిపించింది. నా చుట్టూ ఉన్నది ముందులా లేదు. అంతా మారిపోయింది. అలా అని నేను మూలన కూర్చుని ఏడుస్తూ, ధైర్యం కోల్పోలేదు. ఇంతటితో నా జీవితం ముగియలేదు.. అది ముగిసిన చోటే మొదలవుతుంది. ప్రజెంట్ నేను హ్యాపీగా ఉన్నాను, మంచి వ్యక్తులతో పని చేస్తున్నాను, నా జీవితంలో తదుపరి అధ్యాయం కోసం ఎదురు చూస్తున్నాను’ అని చెప్పుకొచ్చింది సమంత. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతుండగా.. అయ్యో పాపం సమంత అంటూ ఆమె ఫ్యాన్స్ బాధపడుతున్నారు.

Next Story