అతడితో కలిసి తిరుమలకు వెళ్లిన సమంత.. పెళ్లి ఫిక్స్ అయిందా అంటున్న నెటిజన్లు? (వీడియో)

by Mallepaka Hamsa |

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

అతడితో కలిసి తిరుమలకు వెళ్లిన సమంత.. పెళ్లి ఫిక్స్ అయిందా అంటున్న నెటిజన్లు? (వీడియో)
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒకప్పుడు పలు హిట్స్ సాధించిన ఈ భామ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. ఇక తెలుగులోనే కాకుండా తమిళ స్టార్స్‌తోనూ నటించి తన నటన, అందంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. అంతేకాకుండా స్టార్ హీరోయిన్‌గా కొద్ది కాలంపాటు ఇండస్ట్రీనీ షేక్ చేసిందనడంతో అతిశయోక్తి లేదు. కానీ ఆమె అనారోగ్యానికి గురి కావడంతో పూర్తి సినిమాలకు దూరం అయింది. మయోసైటీస్ వ్యాధి బారిన పడటంతో చికిత్స తీసుకున్నప్పటికీ తగ్గకపోవడంతో ఇండస్ట్రీకి దూరం అయి పలు చోట్ల చికిత్స తీసుకుంది. ఇక గత ఏడాది ఓ పాడ్ కాస్ట్ మొదలెట్టిన సామ్ నిత్యం ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు చెప్తూ వార్తల్లో నిలుస్తోంది.

ఇటీవల ఆమె నిర్మాతగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రకటన విడుదల చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ట్రాలాల పిక్చర్స్ సంస్థ ప్రారంభించిన ఆమె ‘శుభం’ (subham) చిత్రాన్ని నిర్మించబోతుంది. అయితే ఈ మూవీ ‘శుభం’ సమ్మర్ స్పెషల్‌గా మే 9న థియేటర్స్‌లోకి రాబోతుంది. తాజాగా, సమంత ‘శుభం’ మూవీ టీమ్‌ను తీసుకుని తిరుమల తిరుపతికి వెళ్లింది. అయితే ఇందులో డైరెక్టర్ రాజ్ నిడిమోరు కూడా ఉండటం గమనార్హం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో అది చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు.

ఇక డేటింగ్‌లో ఉన్న వీరిద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని అందుకే తిరుమలకు వెళ్లారని అంతా చర్చించుకుంటున్నారు. సమంత అభిమానులు మాత్రం వాళ్లు సినిమా తీస్తున్నారు కాబట్టి వెళ్లారు అంతే కానీ మీరు అనుకుంటున్నట్లుగా ఏం లేదని వాదిస్తున్నారు. కాగా, గత కొద్ది కాలంగా సామ్, రాజ్ ఇద్దరు డేటింగ్‌లో ఉన్నారంటూ పలు వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విషయం తెలిసిందే. నిత్యం వీరికి సంబంధించిన వార్తలు ఎన్నో వస్తున్నప్పటికీ వీరిద్దరు మాత్రం స్పందించడం లేదు. దీంతో అంతా పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలోనే తిరుమలకు వెళ్లడంతో సమంత రెండో పెళ్లి చేసుకోవడం ఖాయమని అంటున్నారు.

Next Story