పెళ్లి త‌ర్వాత తొలిసారి భ‌ర్త‌తో స‌మంత..క్యూట్ వీడియో వైరల్

by velandi.Saikiran |

ఏడాది కాలంగా వీళ్ళిద్దరూ డేటింగ్ లో ఉన్నార‌ని సమాచారం. అయితే ప్రేమ విషయం బయట పెట్టకుండానే

పెళ్లి త‌ర్వాత తొలిసారి భ‌ర్త‌తో స‌మంత..క్యూట్ వీడియో వైరల్
X

దిశ‌, వెబ్ డెస్క్ : టాలీవుడ్ హీరోయిన్ సమంత గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తరపు 15 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సమంత, ఇప్పటికీ అగ్రశ్రేణి హీరోయిన్ గానే దూసుకు వెళ్తున్నారు. ఒకసారి పెళ్లయి విడాకులు అయినా కూడా ఆమె బ్రాండ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇక ఇటీవల హీరోయిన్ సమంత రెండో వివాహం చేసుకొని అందరికీ షాక్ ఇచ్చింది. ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరును ప్రేమించి మరి పెళ్లి చేసుకుంది సమంత.

దాదాపు ఏడాది కాలంగా వీళ్ళిద్దరూ డేటింగ్ లో ఉన్నార‌ని సమాచారం. అయితే ప్రేమ విషయం బయట పెట్టకుండానే నేరుగా పెళ్లి చేసుకున్నారు. కొద్దిమంది సమక్షంలోనే సమంత రెండో పెళ్లి జరిగింది. అయితే రెండో పెళ్లి తర్వాత షూటింగ్ లో బిజీ అయిన సమంత తాజాగా తన భర్త రాజ్ నిడిమోరుతో విమానాశ్రయంలో మెరిసింది. సినిమా బిజీలో ఉన్న సమంత, రాజ్ తో ముంబైకి వెళుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ వీడియోలో సమంత కాస్త బక్క చిక్కినట్లు ఉంది. దీంతో వీడియో వైరల్ గా మారింది. క్లిక్

Next Story