- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సమంత.. సంప్రదాయ లుక్‌లో భలే ఉందిగా(వీడియో)
స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విడాకుల తర్వాత మయోసైటీస్(Myositis) అనే వ్యాధి బారిన పడి సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సమంత రీసెంట్‌గా ‘సిటాడెల్: హనీ బన్నీ’(Citadel: Honey Bunny) అనే వెబ్ సిరీస్‌తో మన ముందుకు వచ్చి మంచి మార్కులే కొట్టేసింది. ప్రస్తుతం నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి శుభం అనే మూవీ చేస్తుంది. ఇక ఈ చిత్రం సమ్మర్ స్పెషల్‌గా మే 9న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది.
అయితే తాజాగా సమంత శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. శనివారం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో సమంత శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు సమంతకు వేదాశీర్వచనం అందించారు. అనంతరం ఆలయ సిబ్బంది తీర్థప్రసాదాలు అందజేశారు.ఆలయం వెలుపల సమంతను చూడటానికి, ఆమెతో ఫొటోలు దిగడానికి భక్తుల ఉత్సాహం చూపించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.






