Samantha: అరుదైన ఘనత సొంతం చేసుకున్న సమంత-వరుణ్ ధావన్ ‘సిటాడెల్: హనీ, బన్నీ’.. పోస్ట్ వైరల్

by Mallepaka Hamsa |   (  Updated:2024-12-06 17:05:56  IST  )

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha), వరుణ్ ధావన్(Varun Dhawan) జంటగా నటించిన వెబ్‌సిరీస్ ‘సిటాడెల్: హనీ, బన్నీ’(Citadel: Honey, Bunny).

Samantha: అరుదైన ఘనత సొంతం చేసుకున్న సమంత-వరుణ్ ధావన్ ‘సిటాడెల్: హనీ, బన్నీ’.. పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha), వరుణ్ ధావన్(Varun Dhawan) జంటగా నటించిన వెబ్‌సిరీస్ ‘సిటాడెల్: హనీ, బన్నీ’(Citadel: Honey, Bunny). రాజ్ అండ్ డీకే(Raj and DK) దర్శకత్వం వహించిన ఈ సిరీస్ నవంబర్ 7 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime Video)లో స్ట్రీమింగ్ అవుతోంది. మొదటి రోజు నుంచి ఈ సిరీస్ సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంటూ ఓటీటీలో నంబర్ 1 ప్లేస్‌లో దూసుకుపోతుంది. తాజాగా, ‘సిటాడెల్: హనీ, బన్నీ’ (Citadel: Honey, Bunny)సిరీస్ ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.

ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే క్రిటిక్స్ చాయిస్ అవార్డు(Critics Choice Award)కు ఈ సిరీస్ నామినేట్ అవడంతో పాటు ఉత్తమ విదేశీ భాష సిరీస్‌లో చోటు దక్కించుకుంది. ఈ విషయాన్ని తెలుపుతూ రాజ్ అండ్ డీకే సోషల్ మీడియా(Social Media)లో పోస్ట్ పెట్టారు. అయితే ఈ అవార్డుల వేడుక వచ్చే ఏడాది జనవరి 12న ఘనంగా జరగనున్నట్లు సమాచారం. ప్రజెంట్ రాజ్ అండ్, డీకే పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన వారంతా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక ఈ విషయం తెలుసుకున్న సమంత(Samantha) ఫ్యాన్స్ ఆనంద పడుతున్నారు.

Read More...

Kurnool: శ్రీశైలం మల్లన్నకు ప్రత్యేక పూజలు చేసిన నాగచైతన్య, శోభిత




Next Story