- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Samantha: సిటాడెల్: హనీ బన్నీ సక్సెస్ పార్టీలో డ్యాన్స్ ఇరగదీసిన సామ్-వరుణ్.. పిక్స్ వైరల్!!
టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ నటించిన సిటాడెల్: హనీ బన్నీ వెబ్ సిరీస్ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చి.. మంచి టాక్ సొంతం చేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత(Samantha) నటించిన సిటాడెల్: హనీ బన్నీ(Citadel Honey Bunny) వెబ్ సిరీస్ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చి.. మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ అగ్రతారకు జంటగా బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్(Varun Dhawan) కీలక పాత్రలో నటించాడు. రాజ్ అండ్ డీకే(Raj and DK) దర్శకత్వం వహించిన ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime Video) వేదికన స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఈ వెబ్ సిరీస్ అత్యధిక వ్యూస్ దక్కించుకోవడంతో తాజాగా టీమ్ సక్సెస్ పార్టీ నిర్వహించింది. ముంబయి(Mumbai)లో జరుపుకున్న ఈ పార్టీలో సిటాడెల్ టీమ్ అంతా హాజరై.. తెగ సందడి చేశారు.
కేక్ కట్ చేసి.. ఒకరికొకరు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా సామ్ అండ్ వరుణ్ ధావన్‌లు అదిరిపోయే స్టెప్పులేశారు. వరుణ్ ధావన్ నటిస్తోన్న బేబీ జాన్(Baby John) సినిమాలోని ‘నైన్ మటక్కా’(Nine Matakka) సాంగ్ కు జనాల్ని ఆకట్టుకునేలా డ్యాన్స్ చేశారు. ఈ డ్యాన్స్ వీడియోతో పాటు సామ్ పార్టీకి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. అంతేకాకుండా వీటికి.. ‘ బ్యూటిఫుల్ పర్సన్స్‌తో టైమ్ స్పెండ్ చేసిన అందమైన సాయంత్రం వేళ.. నా మనసు చాలా హ్యాపీగా ఉంది. కృతజ్ఞతతో నిండిపోయింది’. అంటూ సామ్ క్యాప్షన్ జోడించింది. దీనికి వరుణ్ ధావణ్ స్పందించి.. ‘ఎప్పటికీ ది బెస్ట్ కోస్టార్’ అని స్టార్ ఎమోజీని రిప్లై ఇచ్చాడు. అలాగే రాజ్ అండ్ డీకే.. ‘చాలా కష్టమైన జర్నీ అనంతరం సెలబ్రేట్ చేసుకుంటోన్న ఓ పార్టీ’ అని బదులిచ్చారు.






