ఇంట్రెస్టింగ్ క్యాప్షన్‌తో అదిరిపోయే ఫొటోస్ షేర్ చేసిన సమంత.. పోస్ట్ వైరల్

by I. Sairam |

స్టార్ హీరోయిన్ సమంత(Samantha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఇంట్రెస్టింగ్ క్యాప్షన్‌తో అదిరిపోయే ఫొటోస్ షేర్ చేసిన సమంత.. పోస్ట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ హీరోయిన్ సమంత(Samantha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక ‘ఏమాయ చేసావే’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. ఈ మూవీలో హీరోగా నటించిన అక్కినేని నాగచైతన్యతో ప్రేమలో పడింది. అలా కొన్నేళ్లు ప్రేమించుకున్న వీరు పెద్దలను ఒప్పించి పెళ్లి కూడా చేసుకున్నారు.

కానీ, మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకొని దూరంగా ఉంటున్నారు. విడాకుల తర్వాత నాగచైతన్య రీసెంట్‌గా స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళ(Shobhitha Dhulipala)తో డిసెంబర్‌లో రెండో పెళ్లి చేసుకున్నాడు . సమంత మాత్రం విడాకుల తర్వాత మయోసైటీస్(Myositis) అనే వ్యాధి బారిన పడడంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. హెల్త్ పై ఫోకస్ పెట్టింది. కాగా చివరిగా ‘సిటాడెల్: హనీ బన్నీ’(Citadel: Honey Bunny) అనే వెబ్ సిరీస్‌తో మన ముందుకు వచ్చి మంచి మార్కులు కొట్టేసిన సామ్ ప్రెజెంట్ నిర్మాతగా మారి సినిమాలు నిర్మిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా శుభం అనే మూవీను నిర్మించింది. ఇక థియేటర్లలో రిలీజ్ అయిన ఈచిత్రం మంచి టాక్ తెచ్చుకుంది.

అలాగే సోషల్ మీడియా(Social Media)లో ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ తన ఫొటోస్, వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా సామ్ ఇన్‌స్టాగ్రామ్(Instagram) వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో కొన్ని డిఫరెంట్ ఫొటోస్, వీడియోస్ షేర్ చేసింది. ఇక వాటికి ‘ఇక్కడ అంతా చిరిగిపోయినట్లు అనిపిస్తుంది. శబ్దం లేదు, హడావిడి లేదు... ఉండటానికి స్థలం మాత్రమే’ అనే క్యాప్షన్ రాసుకొచ్చింది. దీంతో ఈపిక్స్ కాస్త నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story