- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Samantha: ‘అందుకు మనం భాగస్వామిని కోల్పోవాల్సి వస్తుంది’.. వాలెంటైన్స్ డేన సమంత సెన్సేషనల్ కామెంట్స్ వైరల్
టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ బ్యూటీ సమంత(Samantha) గురించి పరిచయం అక్కర్లేదు.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ బ్యూటీ సమంత(Samantha) గురించి పరిచయం అక్కర్లేదు. కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్ అని చెప్పుకోవచ్చు. కేవలం కుర్రాళ్లకే కాదు.. ఈ బ్యూటీకి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. ఈ హీరోయిన్ సినిమాలు ఫ్లాప్ అయినా.. బ్లాక్ బస్టర్ హిట్ అయినా మాకు ఆల్ టైం హీరోయిన్ సమంతే అని చెప్పుకునే అభిమానులు కోట్లలో ఉన్నారు.
ఈ అందగత్తే.. వెరీ టాలెంటెడ్ నటి టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన మొదట్లోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది. అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ దక్కించుకుందనడంలో అతిశక్తిలేదు. కెరీర్ మొదట్లోనే అగ్ర హీరోల సరసన అవకాశాలు కొట్టేసి.. కోట్లాది మంది ఫ్యాన్స్ ను సొంతం చేసుకుంది. ఏ మాయ చేశావే సినిమాతో సినీ కెరీర్ ప్రారంభించిన సమంత.. తర్వాత వరుసగా అవకాశాలు దక్కించుకుని నెటిజన్ల మనసులో చెరగని ముద్ర వేసుకుంది.
తర్వాత బృందావనం(Brundavanam), దూకుడు, ఈగ, ఎటో వెళ్ళిపోయింది మనసు, ఎటో వెళ్ళిపోయింది మనసు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, జబర్దస్త్, సమ్‌థింగ్ సమ్‌థింగ్(Something Something), అత్తారింటికి దారేది, రామయ్యా వస్తావయ్యా, ఆటోనగర్ సూర్య(Autonagar Surya), మనం, రభస, అఆ,, 24, మహానటి, యూ టర్న్, సీమరాజా(Seemaraja), ఓ బేబీ, జాను, యశోద, కాతువాకుల రెండు కాదల్, శాకుంతలం(Sakunthalam), ఖుషి సినిమాల్లో నటించి ప్రేక్షకుల్ని మెప్పించింది.
అంతేకాకుండా ఈ బ్యూటీ వెబ్ సిరీస్‌ల్లో కూడా రాణిస్తోంది. తనదైన సత్తా చాటుతోంది. సిటాడెల్ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ మా ఇంటి బంగారం, రక్త్‌బ్రహ్మాండ్ వంటి డిఫరెంట్ స్టోరీలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. సినిమాల విషయం పక్కన పెడితే.. తాజాగా సామ్ ఓ ఇంటర్వ్యూకు హాజరై సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.
ఎప్పుడైనా సరే మన ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తీసుకోవాలని వెల్లడించింది.హెల్త్‌ను నిర్లక్ష్యం చేయొద్దని తెలిపింది. మీరు ఒక పర్సన్‌తో మంచి రిలేషన్‌లో ఉండవచ్చని. కానీ మీరు మెంటల్‌గా, ఫిజికల్‌గా లేనప్పుడు మీరు కావాలని కోరుకున్న భాగస్వామికి నచ్చినట్లుగా కనిపించలేరని సామ్ పేర్కొంది. ఒక పర్సన్ మీదికి అందంగా కనిపించినా.. మానసికంగా ప్రశాంతంగా ఉండరని వివరించింది. ముఖ్యంగా ఈ విషయాన్ని గుర్తించకపోతే మీరు ఒక టైంలో మనం ఆ భాగస్వామిని కోల్పోవాల్సి వస్తుందని సమంత ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ బ్యూటీ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.






