- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Samantha: సమంత క్యూట్ ఫొటోస్.. హార్ట్ సింబల్ జోడిస్తూ పొజులు
స్టార్ హీరోయిన్ సమంత(Samantha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ హీరోయిన్ సమంత(Samantha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక ‘ఏమాయ చేసావే’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. ఈ మూవీలో హీరోగా నటించిన అక్కినేని నాగచైతన్యతో ప్రేమలో పడింది. అలా కొన్నేళ్లు ప్రేమించుకున్న వీరు పెద్దలను ఒప్పించి పెళ్లి కూడా చేసుకున్నారు.
కానీ, మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకొని దూరంగా ఉంటున్నారు. విడాకుల తర్వాత నాగచైతన్య రీసెంట్‌గా స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళ(Shobhitha Dhulipala)తో డిసెంబర్‌లో రెండో పెళ్లి చేసుకున్నాడు . సమంత మాత్రం విడాకుల తర్వాత మయోసైటీస్(Myositis) అనే వ్యాధి బారిన పడడంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. హెల్త్ పై ఫోకస్ పెట్టింది. కాగా రీసెంట్‌గా ‘సిటాడెల్: హనీ బన్నీ’(Citadel: Honey Bunny) అనే వెబ్ సిరీస్‌తో మన ముందుకు వచ్చి మంచి మార్కులే కొట్టేసింది.
ప్రజెంట్ నిర్మాతగా మారి శుభం అనే మూవీను నిర్మించింది. ఈచిత్రం మే 9న థియేటర్లలో రిలీజ్ అయి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే తాజాగా సమంతకు సంబంధించిన కొన్ని క్యూట్ ఫొటోస్ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్నాయి. అందులో సామ్ ఫుల్ గ్లామరస్‌గా కనిపించింది. అలాగే తన చేతులతో హార్ట్ సింబల్‌ను చూపిస్తూ చాలా అందంగా నవ్వుతూ ఉంది. ప్రజెంట్ ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.






