Samantha: షాకింగ్‌ లుక్‌లో దర్శనమిచ్చిన సమంత.. ఆందోళనలో ఫ్యాన్స్(పోస్ట్)

by I. Sairam |

స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంటుంది.

Samantha: షాకింగ్‌ లుక్‌లో దర్శనమిచ్చిన సమంత.. ఆందోళనలో ఫ్యాన్స్(పోస్ట్)
X

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక ‘ఏమాయ చేసావే’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. ఈ మూవీలో హీరోగా నటించిన అక్కినేని నాగచైతన్యతో ప్రేమలో పడింది. అలా కొన్నేళ్లు ప్రేమించుకున్న వీరు పెద్దలను ఒప్పించి పెళ్లి కూడా చేసుకున్నారు.

కానీ, మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకొని దూరంగా ఉంటున్నారు. విడాకుల తర్వాత నాగచైతన్య రీసెంట్‌గా స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళ(Shobhitha Dhulipala)తో డిసెంబర్‌లో రెండో పెళ్లి చేసుకున్నాడు . సమంత మాత్రం విడాకుల తర్వాత మయోసైటీస్(Myositis) అనే వ్యాధి బారిన పడడంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. హెల్త్ పై ఫోకస్ పెట్టింది. కాగా రీసెంట్‌గా ‘సిటాడెల్: హనీ బన్నీ’(Citadel: Honey Bunny) అనే వెబ్ సిరీస్‌తో మన ముందుకు వచ్చి మంచి మార్కులే కొట్టేసింది.

అలాగే సోషల్ మీడియా(Social Media)లో ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ తన ఫొటోస్, వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా సామ్ ఇన్‌స్టాగ్రామ్(Instagram) వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో వైట్ కలర్ డ్రెస్ వేసుకుని, గ్రీన్ కలర్ బెల్ట్ పెట్టుకుని, హెయిర్ లీవ్ చేసుకుంది. అయితే ఈ ఫొటోస్‌లో సామ్ బాగా సన్నబడి కనిపించింది.

అంతేకాకుండా వాటికి.. ‘నేను నా ఒంటిని పోగొట్టుకుంటే, నవ్వనని వాగ్దానం చేయి.. నేను ఫిట్‌ని విసిరి ఫొటో తీస్తే.. మీరు నా వైపు తీసుకుంటారా? అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పిక్స్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు ఆందోళన చెందుతున్నారు. అసలు సామ్‌కి ఏమైంది..? ఇంకా మయోసైటీస్ వ్యాధి నుంచి కోలుకోలేదా ఏంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరు ఈ బ్యూటీ పోస్ట్ పై ఓ లుక్ వేసేయండి.

Next Story