ఛాలెంజ్ విసిరిన సమంత... పోస్ట్ వైరల్

by velandi.Saikiran |   (  Updated:2025-06-28 15:16:04  IST  )

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ( Samantha Ruth Prabhu) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మన టాలీవుడ్ ఇండస్ట్రీల

ఛాలెంజ్ విసిరిన సమంత... పోస్ట్ వైరల్
X

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ( Samantha Ruth Prabhu) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మన టాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు 15 సంవత్సరాలుగా అగ్రశ్రేణి హీరోయిన్ గా కొనసాగుతున్నారు సమంత. అలనాటి సౌందర్య తరహాలోనే సమంతకు మంచి ఆదరణ లభిస్తుంది. ఆమె పర్సనల్ జీవితంలో ఎన్నో సమస్యలు ఎదురవుతున్నప్పటికీ.. ప్రేక్షకులను మాత్రం ఆకట్టుకుంటున్నారు.

మంచి మంచి సినిమాలు చేస్తూ దూసుకు వెళ్తున్నారు సమంత. అయితే అలాంటి హీరోయిన్ సమంత తాజాగా ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ఈ సందర్భంగా నెటిజన్స్ కు ఛాలెంజ్ అంటూ... సమంత వెల్లడించారు. మీరు గనక నాలాగా ఇలా మూడు పులప్స్ చేయలేకపోతే నన్ను సన్నగా ఉన్నావు... అనారోగ్యానికి గురయ్యావు అనే కామెంట్స్ చేయకూడదంటూ... ఛాలెంజ్ విసిరారు హీరోయిన్ సమంత.

ఈ మేరకు పులప్స్ చేసిన వీడియోను సోషల్ మీడియా ( Social media) వేదికగా పంచుకున్నారు హీరోయిన్ సమంత. ఎక్కువగా జిమ్ చేస్తుండటంతో సన్నగా అయిపోతున్నామని.. హీరోయిన్ సమంతను గత కొన్ని రోజులుగా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. అనారోగ్యం కారణంగా సమంత ఇలా అవుతుందని మరికొంతమంది పేర్కొన్నారు. అయితే వాళ్లందరి నోర్లు మూయించేందుకే సమంత ఇలా ఛాలెంజ్ విసిరారు. దీంతో ఇప్పుడు... సమంత చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. కాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నిర్మాణంలో వచ్చిన శుభం మంచి టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే.

Next Story