సమంత పెళ్లి.. ఆ రింగు ధర ఎంతో తెలుసా?

by velandi.Saikiran |

సమంత, రాజ్ నిడిమోరుల వివాహం ఈషా ఫౌండేష‌న్ యోగా సెంట‌ర్ లో ఉన్న లింగ్ భైర‌వి ఆల‌యం

సమంత పెళ్లి.. ఆ రింగు ధర ఎంతో తెలుసా?
X

దిశ‌, వెబ్ డెస్క్‌: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఎట్టకేలకు రెండో పెళ్లి చేసుకున్నారు. దాదాపు నాలుగు సంవత్సరాలుగా సింగిల్ లైఫ్ ఈడ్ చేసిన సమంత, రాజ్ నిడిమోరును వివాహమాడారు. చాలా రోజుల నుంచి స‌మంత‌, రాజ్ నిడిమోరు ప్రేమ‌లో ఉన్న‌ట్లు వార్త‌లు రాగా, వాటిని నిజం చేస్తూ, సీక్రెట్ గా కొద్ది మంది స‌న్నిహితుల మ‌ధ్య‌ పెళ్లి చేసేసుకుంది ఈ జంట. అయితే సమంత రెండో పెళ్లి నేపథ్యంలో ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. ఆమె ఎంగేజ్మెంట్ రింగ్ గురించి రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఆ రింగ్‌ ధర దాదాపు 1.5 కోట్ల రూపాయలు ఉంటుందని జ్యువెలరీ నిపుణులు ప్రియాంష్ గోయల్ స్పష్టం చేశారు. ఆమె ధరించిన రింగ్‌ మధ్యలో ఉన్న రెండు క్యారెట్ల లోజెంజ్ కట్ డైమండ్ చుట్టూ ఎనిమిది పోట్రెయిట్ కట్ డైమండ్ పెటల్స్ ఉన్నట్లు తెలిపారు. ఈ రకమైన డిజైన్ ప్రపంచంలో కొద్దిమంది నిపుణులు మాత్రమే తయారు చేయగలరని వివరించారు. ఈ రింగ్‌ సింపుల్ గా కనిపించినప్పటికీ దాని వెనుక ఉన్న కృషి చాలా అద్భుతమని కొనియాడారు.

మొగల్ కాలంలో ఈ తరహా ఉంగరాలకు ఎక్కువగా రాజులు ఆసక్తి చూపించే వారట. తాజ్ మహల్ నిర్మించిన మొగల్ చక్రవర్తి షాజహాన్ భార్య ముంతాజ్ కు కూడా ఈ రకమైన రింగ్‌ అంటే చాలా ఇష్టమని చరిత్రకారులు స్పష్టం చేస్తున్నారు. అలాంటి తరహా రింగే తాజాగా సమంత ధరించారు. పెళ్లి ఫోటోలలో కూడా ఈ రింగ్ కనిపించి బాగా వైరల్ అయింది. కాగా సమంత, రాజ్ నిడిమోరుల వివాహం ఈషా ఫౌండేష‌న్ యోగా సెంట‌ర్ లో ఉన్న లింగ్ భైర‌వి ఆల‌యంలో భూత‌శుద్ధి సంప్ర‌దాయంలో జ‌రిగింది.

Next Story