- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రెండో పెళ్లి.. ఇప్పుడు సమంత ఆస్తుల విలువెంతో తెలుసా?
ప్రముఖ నటి సమంత కొత్త జీవిత అధ్యాయాన్ని ప్రారంభించింది.

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ నటి సమంత కొత్త జీవిత అధ్యాయాన్ని ప్రారంభించింది. దర్శకుడు రాజ్ నిడిమోరుతో ఆమె రెండోసారి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. సోమవారం (డిసెంబర్ 1) తమిళనాడులోని కోయంబత్తూరు ఈశా ఫౌండేషన్‌లో ఉన్న లింగ భైరవి దేవాలయంలో వారి వివాహం చాలా సాదాసీదాగా, కేవలం సన్నిహితుల సమక్షంలో జరిగింది. ఈ కార్యక్రమంలో సమంత వేలికి రాజ్ నిడిమోరు తొడిగిన ఉంగరం మెరిసింది. ఆ ఎంగేజ్‌మెంట్ రింగ్ అందరి దృష్టిని ఆకర్షించింది. గ్రీక్ డిజైనర్ తయారు చేసిన ఆ డైమండ్ ఉంగరం ధర సుమారు 1.5 కోట్ల రూపాయల వరకు ఉంటుందని తెలుస్తోంది.
కాగా.. సమంత రెండోపెళ్లి వార్తల తర్వాత రాజ్ నిడిమోరు, అలాగే సమంత ఆస్తులు ఎంతుంటాయన్న చర్చ మొదలైంది. తాజా అంచనాల ప్రకారం..2025 నాటికి సమంత మొత్తం ఆస్తుల విలువ రూ.100 నుంచి రూ.110 కోట్లు వరకూ ఉండొచ్చని తెలుస్తోంది. ఒక్కో సినిమాకు రూ.3–5 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటూ, బ్రాండ్ ప్రమోషన్ల ద్వారా సంవత్సరానికి దాదాపు రూ.8 కోట్ల వరకు సంపాదిస్తోంది.
సినిమాలతో పాటు రియల్ ఎస్టేట్‌లోనూ భారీగా ఇన్వెస్ట్ చేసింది. హైదరాబాద్‌లో దాదాపు రూ.8 కోట్ల విలువైన లగ్జరీ డూప్లెక్స్ ఫ్లాట్, ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ తర్వాత ముంబైలో సీ-ఫేసింగ్ 3BHKను రూ.15 కోట్లకు కొనుగోలు చేసింది. ఇటీవలే “సీక్రెట్ ఆల్కెమిస్ట్” పేరుతో సొంత పర్ఫ్యూమ్ బ్రాండ్‌ను కూడా లాంచ్ చేసి వ్యాపార రంగంలోకి అడుగుపెట్టింది. లగ్జరీ కార్ల పట్ల ఆమెకు మక్కువ ఎక్కువే. ఆడి Q7, పోర్షే కేమాన్ GTS, రేంజ్ రోవర్ వోగ్, మెర్సిడెస్-బెంజ్ G63 AMG వంటి ఖరీదైన వాహనాలు ఆమె గ్యారేజీలో ఉన్నాయి.ప్రస్తుతం సమంత నెట్‌ఫ్లిక్స్ కోసం “రక్త్ బ్రహ్మాండ్” అనే భారీ వెబ్ సిరీస్‌తో పాటు తెలుగులో “మా ఇంటి బంగారం” సినిమాలో నటిస్తోంది.






