- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Samantha: ప్రియుడితో మళ్లీ దొరికిపోయిన సమంత..? దీపావళి వేళ క్యూట్ ఫోటోలు వైరల్
కొత్త ఇంట్లోనే తాజాగా దీపావళి చేసుకున్నారట సమంత. అయితే ఈ వేడుకల్లో రాజ్ నిడిమోరు ( Raj Nidimoru) కూడా పాల్గొన్నారు.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ సమంత గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అక్కినేని నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన తర్వాత సమంత బ్రాండ్ మరింత పెరిగింది. మొదట్లో అనారోగ్యంతో బాధపడిన సమంత, ఆ తర్వాత ఆ క్రమక్రమంగా కోలుకుంది. అదే సమయంలో తన కెరీర్ పై ప్రత్యేక దృష్టి పెట్టి సక్సెస్ అవుతోంది సమంత. హీరోయిన్ గానే కాకుండా నిర్మాతగా కూడా ప్రస్తుతం హీరోయిన్ సమంత దూసుకు వెళ్తున్నారు. అటు వ్యాపారాలు కూడా లాభాల్లో దూసుకు వెళ్తున్నాయి. చేతినిండా సంపాదిస్తున్న సమంత తాజాగా దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఇటీవల హీరోయిన్ సమంత ( Samantha ) కొత్త ఇంటిని కొనుగోలు చేసినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
దీంతో తన కొత్త ఇంట్లోనే తాజాగా దీపావళి చేసుకున్నారట సమంత. అయితే ఈ వేడుకల్లో రాజ్ నిడిమోరు ( Raj Nidimoru) కూడా పాల్గొన్నారు. దీంతో సమంత దీపావళి వేడుకల ఫోటోలు సోషల్ మీడియాను దున్నేస్తున్నాయి. రాజ్ నిడిమోరుతో హీరోయిన్ సమంత రిలేషన్ పెట్టుకుందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అతన్నే హీరోయిన్ సమంత త్వరలో రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా వార్తలు వైరల్ చేశారు. అయితే దీనిపై ఇప్పటి వరకు ఈ ఇద్దరు ఎక్కడా కూడా స్పందించలేదు. కానీ సమంత ఎక్కడ ఉంటే అక్కడే రాజ్ నిడిమోరు కనిపిస్తున్న నేపథ్యంలో రూమర్స్ వైరల్ అవుతున్నాయి. ఇక లేటేస్ట్ గా దీపావళి వేడుకలు కూడా సమంతతో రాజ్ నిడిమోరు చేసుకున్నాడు. క్లిక్
READ MORE .....
Rashmika : బ్రేకప్ పై రష్మిక రియాక్షన్.గుండె పగిలిపోయిందంటూ !






