Samantha: నాగచైతన్య, శోభిత పెళ్లిపై మొదటిసారి స్పందించిన సమంత.. ఆసక్తికర కామెంట్స్ వైరల్

by Mallepaka Hamsa |

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha), ‘ఏమాయ చేసావే’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయి.. ఈ క్రమంలోనే నాగచైతన్య(Naga Chaitanya)తో ప్రేమలో పడింది.

Samantha: నాగచైతన్య, శోభిత పెళ్లిపై మొదటిసారి స్పందించిన సమంత.. ఆసక్తికర కామెంట్స్ వైరల్
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha), ‘ఏమాయ చేసావే’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయి.. ఈ క్రమంలోనే నాగచైతన్య(Naga Chaitanya)తో ప్రేమలో పడింది. వీరిద్దరు కొద్ది కాలం డేటింగ్ చేసిన తర్వాత పెద్దలను ఒప్పించి గ్రాండ్‌గా సినీ సెలబ్రిటీలందరినీ పిలిచి పెళ్లి చేసుకున్నారు. కానీ వీరి కాపురం మున్నాళ్ల ముచ్చటగానే మారింది. మనస్పర్థలు తలెత్తడంతో నాలుగేళ్లకే విడాకులు తీసుకుని విడిపోయారు. ఈ నేపథ్యంలోనే సమంతకు మయోసైటీస్ రావడంతో సినిమాలకు దూరం అయి పూర్తిగా ఇంట్లోను ఉండి చికిత్స తీసుకుంది. అలాగే పలు దేశాల్లో తిరుగుతూ రకరకాల ట్రీట్‌మెంట్ తీసుకున్న తర్వాత ఆమె కాస్త కోలుకుంది. దీంతో ఓ హెల్త్ పాడ్ కాస్ట్ స్టార్ట్ చేసి టిప్స్ చెప్తోంది.

కానీ సినిమాల్లోని మాత్రం రీఎంట్రీ ఇవ్వలేదు. కానీ ఇటీవల ‘సిటాడెల్: హనీ బన్నీ’ వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సిరీస్‌కు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ లభించింది. కానీ సామ్ మాత్రం మళ్లీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వలేదు. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ఇక నాగచైతన్య విషయానికొస్తే.. కొద్ది కాలం సమంతను గుర్తు తెచ్చుకుని బాధపడ్డారు. ఆ తర్వాత నుంచి యంగ్ బ్యూటీ శోభిత(Sobitha Dhulipala)తో డేటింగ్ చేశారు. ఇక గత ఏడాది పెద్దలను ఒప్పించి వీరిద్దరు పెళ్లి కూడా చేసుకున్నారు. ప్రస్తుతం పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేస్తూనే సినిమాల్లోనూ నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.

ఇక వీరిద్దరి పెళ్లిపై ఇప్పటి వరకు సామ్ ఎక్కడా స్పందించలేదు. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో భాగంగా సామ్‌కు చైతు రెండో పెళ్లిపై ప్రశ్న ఎదురవడంతో ఆమె రియాక్ట్ అయింది. మీ మాజీ భాగస్వామి కొత్త బంధంలోకి అడుగుపెట్టినందుకు మీరు ఏమైనా అసూయ పడుతున్నారా? అని యాంకర్ ప్రశ్నించగా.. దీనికి సమంత ‘‘నా జీవితంలో అసూయకు తావులేదు. నా జీవితంలో అది భాగం కావడాన్ని కూడా అంగీకరించను. అసూయే అన్ని చెడులకు మూలమని నేను భావిస్తాను. కాబట్టి నాకు వాళ్లపై ఎలాంటి అసూయ లేదు. అలాంటి వాటి గురించి ఆలోచించను’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సామ్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ విషయం తెలుసుకున్న వారంతా ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Next Story