Samantha: "నాకు ఆ ప్రేమ కంటే ఏది గొప్పది" కాదంటూ షాకింగ్ పోస్ట్ పెట్టిన సమంత

by Phanindra |   (  Updated:2024-12-09 07:31:00  IST  )

సమంత షాకింగ్ పోస్ట్ ఒకటి ఇన్స్టా గ్రామ్ లో పోస్ట్ చేసింది.

Samantha: నాకు ఆ ప్రేమ కంటే ఏది గొప్పది కాదంటూ షాకింగ్ పోస్ట్ పెట్టిన సమంత
X

దిశ, వెబ్ డెస్క్ : ఒకప్పుడు టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిన స్టార్ హీరోయిన్ సమంత ( Samantha) ప్రస్తుతం ఎన్నో సమస్యలను ఎదుర్కొంటుంది. ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కోసం ఎప్పుడూ ఏదొక పోస్ట్ పెడుతూనే ఉంది. ఈమె పెట్టె పోస్టులు ఒక్కోసారి నాగ చైతన్యను టార్గెట్ చేసి పెట్టినట్టు ఉంటుంది.

డివోర్స్ తర్వాత నుంచి నెగిటివ్ గా ఏ చిన్న పోస్ట్ పెట్టినా అది చైతూ కోసమే పెడుతుందని చాలా మంది అనుకున్నారు. ఈ మధ్య కాలంలో సామ్ పెట్టె పోస్టులు కూడా అలానే ఉంటున్నాయి. అయితే, తాజాగా సమంత షాకింగ్ పోస్ట్ ఒకటి ఇన్స్టా గ్రామ్ లో పోస్ట్ చేసింది. సామ్ పెంచుకునే కుక్క కళ్ళల్లోకి చూస్తూ ' నా కుక్క ప్రేమ కంటే ఏ ప్రేమ గొప్పది కాదు..' అంటూ ఫోటోను షేర్ చేసింది.

ఓ వైపు శోభిత దూళిపాళ్ల ( Sobhita Dhulipala) , నాగ చైతన్య( Naga Chaitanya) పెళ్లి ఫోటోలు నెట్టింట ట్రెండ్ అవుతుంటే .. ఇంకో వైపు ఈ పోస్ట్ కూడా అంతే విధంగా వైరల్ అవుతుంది. ఈ పోస్ట్ చూసి చాలా మంది సమంత.. ఇది చైతూను ఇన్ డైరెక్ట్ గా టార్గెట్ చేస్తూ పెట్టి ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు.

Next Story