- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అల్ట్రా స్టైలిష్ లుక్‌లో కట్టిపడేస్తున్న సమంత
నేవీ బ్లూ కలర్ అల్ట్రా స్టైలిష్ లుక్ ఉన్న డ్రెస్సులో హాట్ స్టిల్స్‌తో అలరిస్తున్న సమంత.

దిశ, వెబ్ డెస్క్ : మోస్ట్ గార్జియస్ అండ్ టాలెంటెడ్ నటి సమంత గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 'ఏ మాయ చేసావె'తో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ హీరోయిన్ మొదటి సినిమాతోనే స్టార్ పాపులారిటీని సంపాదించుకుంది. ఆ తర్వాత ఎప్పుడూ వెనక్కి తిరిగి చూసుకొనే అవసరం లేకుండా కెరీర్ను ముందుకు సాగించింది.
తెలుగులో బిజీగా అవకాశాలు వస్తున్న సమయంలోనే ఈమె తమిళ ఇండస్ట్రీలో కూడా అవకాశాలు దక్కించుకుంది. అక్కడ కూడా స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. ఈ బ్యూటీ తన కెరీర్ ఫోకస్ను ఎక్కువ శాతం టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలపైనే పెట్టింది. ఇప్పటికీ ఈమెకు చెక్కుచెదరని క్రేజ్ ఉంది. కానీ, ఈ హీరోయిన్ మాత్రం కెరీర్ను అత్యంత నెమ్మదిగా ముందుకు సాగిస్తుంది.
హీరోయిన్గా మంచి క్రేజ్ కలిగిన సమయంలోనే ఈమె ది ఫ్యామిలీ మెన్ సీజన్ 2, సిటాడెల్ : హనీ బన్నీ అనే వెబ్ సిరీస్లలో కూడా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. కొంతకాలం క్రితమే ఈమె నిర్మాణ రంగంలోకి కూడా అడుగుపెట్టి శుభం అనే చిత్రాన్ని నిర్మించింది. అందులో సమంత కీలక పాత్రలో కూడా నటించింది.
సినిమాల్లో తన అందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోసి కుర్రకారు ప్రేక్షకులను ఎన్నోసార్లు అలరించిన సమంత సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. తాజాగా సమంతకు సంబంధించిన కొన్ని ఫోటోలు వైరల్ గా మారాయి.
అందులో ఈమె నేవీ బ్లూ కలర్ అల్ట్రా స్టైలిష్ లుక్ ఉన్న డ్రెస్ను వేసుకొని అంతే స్టైలిష్ లుక్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం అవి సూపర్ గా వైరల్ అవుతున్నాయి. ఇందులో సమంత తన బ్యాక్ అందాలతో యూత్ ను సూపర్ గా ఆకర్షిస్తుంది.






