చైతన్య గుర్తులను ఒక్కొక్కటిగా చెరిపేస్తున్న సమంత.. గుడ్ డెసిషన్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్

by Gugulothu.Kavitha |   (  Updated:2025-06-08 04:33:45  IST  )

స్టార్ హీరోయిన్ సమంత(Samantha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

చైతన్య గుర్తులను ఒక్కొక్కటిగా చెరిపేస్తున్న సమంత.. గుడ్ డెసిషన్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ హీరోయిన్ సమంత(Samantha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక ‘ఏమాయ చేసావే’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. ఈ మూవీలో హీరోగా నటించిన అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya)తో ప్రేమలో పడింది. అలా కొన్నేళ్లు ప్రేమించుకున్న వీరు పెద్దలను ఒప్పించి పెళ్లి కూడా చేసుకున్నారు. కానీ, మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకొని దూరంగా ఉంటున్నారు. విడాకుల తర్వాత నాగచైతన్య రీసెంట్‌గా స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళ(Shobhitha Dhulipala)తో డిసెంబర్‌లో రెండో పెళ్లి చేసుకున్నాడు .

సమంత మాత్రం విడాకుల తర్వాత మయోసైటీస్(Myositis) అనే వ్యాధి బారిన పడడంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. హెల్త్ పై ఫోకస్ పెట్టింది. కాగా ప్రజెంట్ నిర్మాతగా మారి ‘శుభం’(Shubham) సినిమాను నిర్మించిన సంగతి తెలిసిందే. తన ఫస్ట్ మూవీతోనే ప్రొడ్యూసర్‌గా సక్సెస్ అయింది. ఇదిలా ఉంటే తాజాగా సమంతకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. సామ్ మెడపై వైఎమ్‌సి(YMC) అనే టాటూ ఉంటుంది.

తన మొదటి సినిమా ‘ఏ మాయ చేశావే’ గుర్తుగా ఆ టాటూ వేయించుకుంది సమంత. గౌతమ్ మీనన్(Gowtham Menon) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో నాగ చైతన్య హీరోగా నటించాడు. ఇక ఈ వైఎమ్‌సి టాటూ గురించి పలు ఇంటర్వ్యూల్లోనూ సమంత చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ వీడియోలో సమంత మెడ పై టాటూ ఎక్కడా కూడా కనిపించకపోవడంతో ఆమె ఫ్యాన్స్ గుడ్ డెసిషన్ తీసుకున్నావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై సామ్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

Next Story