Samantha: ‘మీరు మారడం కొనసాగుతోన్న ప్రక్రియ.. ఏదీ స్థిరంగా లేదు’.. నెట్టింట ఆసక్తిని రేకెత్తిస్తోన్న సమంత ఇన్‌స్టా స్టోరీ

by Kodari Anjali |   (  Updated:2025-02-12 07:58:39  IST  )

ఏ మాయ చేశావే సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత (Samantha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

Samantha: ‘మీరు మారడం కొనసాగుతోన్న ప్రక్రియ.. ఏదీ స్థిరంగా లేదు’.. నెట్టింట ఆసక్తిని రేకెత్తిస్తోన్న సమంత ఇన్‌స్టా స్టోరీ
X

దిశ, వెబ్‌డెస్క్: ఏ మాయ చేశావే సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత (Samantha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. మొదటి సినిమాతోనే స్టార్ గుర్తింపు సంపాదించుకున్న ఈ హీరోయిన్ తర్వాత పెద్ద పెద్ద హీరోల సినిమాల్లోనే అవకాశాలు సంపాదించుకుంది. జూనియర్ ఎన్టీఆర్(Junior NTR) సరసన బృందావనం, టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు(Superstar Mahesh Babu)కు జంటగా దూకుడు, నేచురల్ స్టార్ నాని(natural star Nani)తో ఈగ వంటి సినిమాల్లో నటించింది ప్రేక్షకుల్ని మెప్పించింది.

వీటితో పాటుగా ఈ ముద్దుగుమ్మ ఎటో వెళ్ళిపోయింది మనసు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ఎటో వెళ్ళిపోయింది మనసు, జబర్‌దస్త్, అత్తారింటికి దారేది, సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌, రామయ్యా వస్తావయ్యా, మనం, రభస, అఆ,, 24, మహానటి, యూ టర్న్, సీమరాజా, ఓ బేబీ, జాను, యశోద, ఖుషి, ఆటోనగర్ సూర్య, కాతువాకుల రెండు కాదల్, శాకుంతలం వంటి సినిమాల్లో నటించి జనాల మన్ననలు పొందింది. ఓ

ఓ వైపు సినిమాల్లో నటిస్తూ మరోవైపు వెబ్ సిరీస్‌లతో కూడా దూసుకుపోతుంది ఈ నటి. కొంతకాలం ఈ బ్యూటీ సినిమాలకు బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఖుషి సినిమా అనంతరం సంవత్సరం పాటు సినిమాలకు దూరంగా ఉంది. మయోసైటిస్(Myositis disease) అనే వ్యాధితో చాలా రోజులు సఫర్ అయింది. ప్రస్తుతం ఆ వ్యాధి నుంచి కోలుకుని.. మళ్లీ సినిమాల బాట పట్టింది. ప్రస్తుతం మరో కొత్త వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే సామ్ సోషల్ మీడియాలో తరచూ ఏదోక పోస్ట్ పెడుతుంటుందన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ బ్యూటీ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో.. ‘‘మానవుడిగా, మీరు ఒక జీవి కాదు. మీరు మారడం కొనసాగుతోన్న ప్రక్రియ. ఏదీ స్థిరంగా లేదు. మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో అలా ఉండవచ్చు. సధగతు’’ అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం సామ్ ఇన్‌స్టా స్టోరీ నెట్టింట ఆసక్తిగా మారింది.

Next Story