- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Samantha: ప్రతిదీ రెండుసార్లు క్రియేట్ అవుతుంది.. మొదట మనస్సులో రెండోది..? అంటూ ఇంట్రెస్టింగ్ కోట్ పంచుకున్న సామ్
సినీ ఇండస్ట్రీలో అండ్ ప్రజల్లో బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత క్రేజ్ అంతా ఇంతా కాదు.

దిశ, వెబ్‌డెస్క్: సినీ ఇండస్ట్రీలో అండ్ ప్రజల్లో బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ అమ్మడు సినిమాలు హిట్, ప్లాప్ ఏ టాక్ సొంతం చేసుకున్నా.. ఆల్ సమంత ఫ్యాన్స్‌మే అని చెప్పుకునే కుర్రాళ్లతో పాటు అమ్మాయిలు కూడా ఉన్నారు. ఈ అమ్మడు తెలుగులో అనేక సినిమాల్లో నటించి.. ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. తన అందం, నటన, అభినయం, అమాయకత్వం, డ్యాన్స్‌తో మెప్పించిందనడంలో అతిశయోక్తిలేదు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ వంటి అగ్ర హీరోల సినిమాల్లో అవకాశాలు కొట్టేసి.. స్టార్ డమ్ సంపాదించుకుంది. ఒక సంవత్సరం మయోసైటిస్ వ్యాధి కారణంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ప్రస్తుతం మళ్లీ సినిమాల బాట పట్టిన సమంత సినిమాల్లోనే కాకుండా వెబ్ సిరీస్‌ల్లో కూడా నటిస్తూ తన సత్తా చాటుతోంది. ఇప్పటికే తను నటించిన సిటాడెల్: హనీ బన్నీ అనే వెబ్ సిరీస్ జనాల్ని విపరీతంగా ఆకట్టుకుంది. ఇటీవలే నిర్మాతగా ఎంట్రీ ఇచ్చింది.
మొదటి సినిమాగా శుభం చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో సమంత క్రేజ్ సినీ పరిశ్రమలో మరింత పెరిగిపోయింది. అటు సామ్ సినిమాల్లో కీలక రోల్స్‌లో పోషిస్తూ... ఇటు నిర్మాతగా మారి తనలోని ప్రతిభను బయటపెడుతోంది. ఇకపోతే సమంత సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ జనాల్ని ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ బ్యూటీ నెట్టింట ఓ మంచి మాటను పంచుకుంది.. ‘‘ప్రతిదీ రెండుసార్లు క్రియేట్ అవుతుంది.. మొదట మనస్సులో రెండోది వాస్తవంలో అంటూ సమంత రాబిన్ శర్మ చెప్పిన ఈ కోట్‌ను అభిమానులతో పంచుకుంది.






