- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒక ఆటోగ్రాఫ్ ఒక సెల్ఫీ ఒకటి చాలా బోరింగ్.. 2 అనేది కొత్త ట్రెండ్ అంటూ వీడియో పంచుకున్న సమంత.. దేని గురించంటే?
టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ బ్యూటీ కెరీర్ మొదట్లోనే అగ్ర హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంది. అతితక్కువ సమయంలోనే సామ్ స్టార్ డమ్ సంపాదించుకుంది.
తన అందం, అభినయం, నటన, డ్యాన్స్ తో స్టార్ డమ్ సంపాదించుకుంది. తన తొలి చిత్రమైన ఏ మాయ చేశావే సినిమాతో 2010లో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టింది. తర్వాత బృందావనం, దూకుడు, ఈగ, ఎటో వెళ్ళిపోయింది మనసు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అత్తారింటికి దారేది వంటి చిత్రాలతో అతితక్కువ సమయంలోనే తెలుగునాట ప్రముఖ కథానాయికగా ఎదిగింది.
అంతేకాకుండా మయోసైటిస్ వ్యాధి నుంచి కొలుకున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవలే శుభం సినిమాకు నిర్మాతగా వ్యవహరించింది. సామ్ నిర్మించిన తొలి చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇందులో హర్షిత్ మల్గిరెడ్డి ప్రధాన పాత్ర పోషించాడు.వీరితో పాటుగా శ్రియ కొంథం, చరణ్ పెరి, షాలిని కొండేపూడి గౌడ్, గవిరెడ్డి శ్రీనివాస్, శ్రావణి,వంశీధర్ గౌడ్.. సమంత కూబి ఈ సినిమాలో అతిధి పాత్రలో నటిస్తుంది.
ఇకపోతే తాజాగా సమంత సోషల్ మీడియా వేదికన ఓ పోస్ట్ పెట్టింది. ‘‘ఒక ఆటోగ్రాఫ్, ఒక సెల్ఫీ, ఒకటి చాలా బోరింగ్‌గా ఉంది. 2 అనేది కొత్త ట్రెండ్. డ్యూయల్ చిప్ పవర్‌తో బోల్డ్, ది స్లీక్ మరియు ది స్టైలిష్ - #iQOONeo10 ని పరిచయం చేస్తున్నాం. ఎందుకంటే #RenduThaanIniTrendu #AmazonSpecials #2IsTheNewTrend #ad’’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ మొబైల్‌కు సంబంధించి సామ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.






