- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Samantha: చీరలో సమంత.. అయ్యో పాపం అంటూ ఏడుస్తున్న ఎమోజీలను జోడిస్తున్న నెటిజన్లు
స్టార్ హీరోయిన్ సమంత(Samantha) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ హీరోయిన్ సమంత(Samantha) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ‘ఏమాయ చేశావే’(Ye Maya Chesave) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది చాలా హిట్స్ సినిమాల్లో నటించి మెప్పించింది. స్టార్ హీరోయిన్ రేంజ్‌కి వెళ్లిపోయింది. అయితే హీరో నాగచైతన్య(Naga Chaitanya)తో విడాకుల తర్వాత మయోసైటీస్(Myositis) వ్యాధి బారిన పడి సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ఆ తర్వాత గత ఏడాది ‘సిటాడెల్: హనీ బన్నీ’(Citadel:Honey Bunny) మూవీతో మన ముందుకు వచ్చి మంచి మార్కులు కొట్టేసింది. ప్రెజెంట్ నిర్మాతగా మారి రీసెంట్‌గా ‘శుభం’(Shubham) అనే మూవీని నిర్మించింది.
థియేటర్లలో రిలీజ్ అయిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఈ క్రమంలో తాజాగా సామ్ తానా కార్యక్రమంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మంచి క్లాసిక్ శారీ కట్టుకొని వెళ్ళింది. అయితే తాజాగా సామ్ ఆ పిక్స్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. ‘లాస్ట్ ఈవెనింగ్’ అనే క్యాప్షన్ జోడించింది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. ఈ ఫొటోస్‌లో సమంత చాలా బక్కచిక్కిపోయి కనిపించింది. ఒంటి మీద ఎముకలు మాత్రమే ఉన్నాయి కావొచ్చు అనే వేలో కనిపించింది. దీంతో ఆమె ఫ్యాన్స్, నెటిజన్లు అయ్యో సమంత అప్పట్లో ఎంత బొద్దుగా ముద్దుగా ఉండే దానివి నిన్ను ఇప్పుడు ఇలా చూస్తుంటే చాలా బాధగా ఉంది అని ఏడుస్తున్న ఎమోజీలను జోడిస్తున్నారు.






