Samantha: సింగిల్ ఫోన్‌ కాల్‌లో అతనికి శుభం చెప్పేశా.. సమంత ఇంట్రెస్టింగ్ వీడియో

by Gugulothu.Kavitha |

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) ప్రస్తుతం నిర్మాతగా మారి ‘శుభం’ (shubham)సినిమాను తన సొంత ట్రాలాలా మూవీస్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

Samantha: సింగిల్ ఫోన్‌ కాల్‌లో అతనికి శుభం చెప్పేశా.. సమంత ఇంట్రెస్టింగ్ వీడియో
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) ప్రస్తుతం నిర్మాతగా మారి ‘శుభం’ (shubham)సినిమాను తన సొంత ట్రాలాలా మూవీస్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇక దీనికి ప్రవీణ్ కండ్రేగుల(Praveen Kandregula) దర్శకత్వం వహిస్తుండగా ఇప్పటికే ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ అన్ని సూపర్ రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. కాగా ఈ చిత్రం మే 9న థియేటర్స్‌లో విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో.. ‘శుభం’ మూవీ టీమ్ అంతా కలిసి ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.

ఇందులో భాగంగా తాజాగా సమంత ఇన్‌స్టాలో ఓ వీడియో షేర్ చేసింది. అందులో వెన్నెల కిశోర్‌(Vennela Kishore)కి వీడియో కాల్ చేసి నా శుభం మూవీ ప్రీమియర్స్‌కి రావట్లేదా అని అడుగుతుంది. అప్పుడు వెన్నెల కిశోర్ యాక్చువల్‌గా నా సింగిల్ మూవీ కూడా అదే రోజు రిలీజ్ కాబోతుంది అని చెప్పాలని ట్రై చేస్తుండగా అతన్ని అసలు మాట్లాడనీయకుండా నా కోసం నువ్వు, నీ ఫ్యామిలీ కచ్చితంగా వస్తారు కదా.. నిర్మాతగా చేసిన ఫస్ట్ మూవీ కాబట్టి వస్తారని నాకు తెలుసు అని అసలు అతన్ని మాట్లాడనీయదు.

లాస్ట్‌కి కచ్చితంగా వస్తున్నావు అని కట్ చేసేస్తది. ఇక ఈ వీడియోను షేర్ చేస్తూ సింగిల్ ఫోన్ కాల్‌లో వెన్నెల కిశోర్‌కి శుభం చెప్పేశా.. మే 9న థియేటర్లలో రిలీజ్ కాబోతుంది’ అని రాసుకొచ్చింది. దీంతో ఈ వీడియో కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది.ఇక దీన్ని చూసిన నెటిజన్లు అయ్యో పాపం కిశోర్ గారు అని కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరు కూడా ఈ వీడియోను చూసేయండి.

Next Story