- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభాస్‌తో సినిమా గురించి ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చిన సమంత
ప్రభాస్‌తో సినిమా చేసే అవకాశంపై ప్రశ్నించగా సమంత “తెలియదు” అని సమాధానం ఇచ్చింది.

దిశ, వెబ్ డెస్క్: టాలెంటెడ్ నటీమణి సమంత తాజాగా నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ‘మా ఇంటి బంగారం’ అనే లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది. ఈ చిత్రాన్ని జూన్ 19న విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో సమంత, నందిని రెడ్డి పెద్ద ఎత్తున ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా సమంతకు ప్రభాస్‌తో సినిమా గురించి ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. తెలుగు సినీ పరిశ్రమలోని చాలా మంది స్టార్ హీరోలతో మీరు స్క్రీన్ షేర్ చేసుకున్నారు.
కానీ ఇప్పటివరకు ప్రభాస్‌తో సినిమా చేయలేదు. భవిష్యత్తులో ప్రభాస్‌తో సినిమా చేసే అవకాశం ఏమైనా ఉందా? అని ప్రశ్నించారు. దీనికి సమంత “తెలియదు” అని సమాధానం ఇచ్చింది. వెంటనే పక్కనే ఉన్న నందిని రెడ్డి స్పందిస్తూ, అది ఆమెకు ఇప్పుడు ఎలా తెలుస్తుంది? ఎవరైనా ప్రభాస్ సినిమాకు సమంతను ఉద్దేశించి కథ రాసినా, లేదా ఆమెను సంప్రదించినా అప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలదు. ప్రస్తుతం ఆమె కూడా ఏమీ చెప్పలేరు కదా అని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇక ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.






