- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Samantha: ‘బెస్ట్ హగ్ ఎవర్’ అంటూ సమంత పోస్ట్.. వావ్ బ్యూటిఫుల్ అంటున్న నెటిజన్లు
స్టార్ హీరోయిన్ సమంత(Samantha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంటుంది.

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ సమంత(Samantha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక ‘ఏమాయ చేసావే’(Ye maya chesave) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. ఈ మూవీలో హీరోగా నటించిన అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya)తో ప్రేమలో పడింది. అలా కొన్నేళ్లు ప్రేమించుకున్న వీరు పెద్దలను ఒప్పించి పెళ్లి(Marriage) కూడా చేసుకున్నారు. కానీ, మనస్పర్థలు రావడంతో విడాకులు(Divorce) తీసుకొని దూరంగా ఉంటున్నారు. విడాకుల తర్వాత నాగచైతన్య రీసెంట్‌గా స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళ(Shobitha Dhulipala)ను రెండో పెళ్లి చేసుకున్నాడు. కానీ, సమంత మాత్రం విడాకుల తర్వాత మయోసైటీస్(Myositis) అనే వ్యాధి బారిన పడడంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. హెల్త్ పై ఫోకస్ పెట్టింది. కాగా రీసెంట్‌గా ‘సిటాడెల్: హనీ బన్నీ’(Citadel:Honey Bonny) అనే వెబ్ సిరీస్‌తో మన ముందుకు వచ్చింది. ఈ సిరీస్‌లో సమంత నటనకు మంచి మార్కులే పడ్డాయి.
అలాగే సామ్ నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన లేటెస్ట్ ఫొటోలు, తన వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా సమంత తన ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. అందులో ఓ క్యూట్ పాపను హగ్ చేసుకున్న పిక్‌ను షేర్ చేస్తూ.. బెస్ట్ హగ్ ఎవర్(Best Hug Ever) అనే క్యాప్షన్‌ను జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్త వైరల్‌గా మారింది. ఇక దీనిని చూసిన నెటిజన్లు ‘వావ్ బ్యూటిఫుల్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరు ఈ పోస్ట్‌పై ఓ లుక్ వేసేయండి.






