స్టేజ్ పైన సమంత స్టెప్పులు... గుండెలు జారిపోవాల్సిందే !

by velandi.Saikiran |   (  Updated:2025-05-05 06:17:21  IST  )

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ( Samantha) చాలా రోజుల తర్వాత లైవ్ లో డాన్స్ చేశారు. ఏకంగా స్టేజ్ పైనే... క్లాసికల్ స్టెప్

స్టేజ్ పైన సమంత స్టెప్పులు... గుండెలు జారిపోవాల్సిందే !
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ( Samantha) చాలా రోజుల తర్వాత లైవ్ లో డాన్స్ చేశారు. ఏకంగా స్టేజ్ పైనే... క్లాసికల్ స్టెప్స్ వేసిన సమంత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజాగా శుభం సినిమా ( Shubham) ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ సినిమాకు నిర్మాతగా సమంత కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మే 9వ తేదీన.. ఈ సినిమా రిలీజ్ కాబోతోంది.

ఇలాంటి నేపథ్యంలోనే వైజాగ్ వేదికగా శుభం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. అయితే ఈ ఈవెంట్ కు హీరోయిన్ సమంత కూడా వెళ్లారు. సింపుల్ సారీ కట్టుకొని.... స్లీవ్ లెస్ బ్లౌజ్ లో హీరోయిన్ సమంత మెరిశారు. దీంతో ఈవెంట్ కు వెళ్లిన జనాలంతా సమంత ను చూసేందుకు ఎగబడ్డారు. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా హీరోయిన్ సమంత ప్రేక్షకుల కోసం స్టెప్పులు కూడా వేశారు. శుభం సినిమాలోని ఓ పాటకు అదిరిపోయే స్టెప్పులు వేశారు. సమంత తో పాటు ఈ సినిమాలో నటించిన వారు కూడా డాన్స్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

ఇక ఈ వీడియోని చూసిన సినిమా ప్రియులు.. ఆకాశం నుంచి దిగివచ్చిన దేవత లాగా సమంత కనిపిస్తోందని కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా.. సమంత ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశారు. మరోసారి తనను ఆశీర్వదించాలని పేర్కొన్నారు. అలాగే.. ఎన్ని ఇబ్బందులు వచ్చినా... తన ఫ్యాన్స్ కోసం నిత్యం సినిమాలు చేస్తూనే ఉంటానని ప్రకటించారు.

స్టేజ్ పైన సమంత స్టెప్పులు... గుండెలు జారిపోవాల్సిందే !

Read More..

సమ్మర్ ట్రీట్.. ఘాటు అందాలతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్న సమంత


Next Story