మ‌రోసారి ప్రియుడితో దొరికిపోయిన స‌మంత !

by velandi.Saikiran |   (  Updated:2025-11-19 19:31:43  IST  )

సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరు ( Raj Nidimoru ) తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

మ‌రోసారి ప్రియుడితో దొరికిపోయిన స‌మంత !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: టాలీవుడ్ హీరోయిన్ సమంత( Samantha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏం మాయ చేసావే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ అందాల తార, ఆ తర్వాత ఇండస్ట్రీని దున్నేసింది. ఇప్పటికీ కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రశ్రేణి హీరోయిన్ గానే సమంత కొనసాగుతున్నారు. హీరోయిన్ గానే కాకుండా ఇటీవల కాలంలో నిర్మాతగా కూడా అవతారం ఎత్తారు. రకరకాల వ్యాపారంలో కూడా దూసుకు వెళ్తున్నారు సమంత. అయితే అక్కినేని నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన తర్వాత బ్యాచిలర్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరు ( Raj Nidimoru ) తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

వీళ్ళిద్దరి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా జోరుగా ప్రచారం సాగుతోంది. ఇందులో భాగంగానే ఇటీవల రాజ్ నిడిమోరుతో సమంత క్లోజ్ గా ఉన్న ఫోటోలు బయటపడ్డాయి. దీంతో వీళ్లిద్దరి మధ్య రిలేషన్ ఉందని అందరు ఫిక్స్ అయిపోయారు. ఇలాంటి నేపథ్యంలో మరోసారి తన రూమర్ ప్రియుడు రాజ్ నిడిమోరుతో మెరిసింది సమంత. హైదరాబాద్ నుంచి ముంబైకి సమంత, రాజ్ నిడిమోరు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే హైదరాబాద్ విమానాశ్రయంలో ఈ జంట మెరిసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజెన్స్‌ రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. తన ప్రియుడితో వెకేషన్ కు వెళ్తోందని సమంతను ఉద్దేశించి రియాక్ట్ అవుతున్నారు నెటి జెన్స్. క్లిక్

Next Story