రేపు గ్రాండ్‌గా ప్రారంభం కానున్న సల్మాన్–వంశీ పైడిపల్లి మూవీ

by Pulgam srinivas |

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం సల్మాన్-వంశీ పైడిపల్లి కాంబో ఈ మూవీకి సంబంధించిన ప్రారంభ కార్యక్రమాలను రేపు (?ముంబైలో ఘనంగా నిర్వహించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

రేపు గ్రాండ్‌గా ప్రారంభం కానున్న సల్మాన్–వంశీ పైడిపల్లి మూవీ
X

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ టాలీవుడ్ ప్రతిభావంతమైన దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించనున్నారు. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, ఈ మూవీకి సంబంధించిన ప్రారంభ కార్యక్రమాలను రేపు ముంబైలో ఘనంగా నిర్వహించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రారంభ కార్యక్రమం అనంతరం సినిమాకు సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ చిత్రంతో వంశీ పైడిపల్లి బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించబోతుండటం విశేషం. ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తే, ఆయనకు హిందీ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు లభించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. అలాగే తెలుగు దర్శకుడు, నిర్మాత కలిసి రూపొందిస్తున్న చిత్రం కావడంతో, ఈ సినిమా విజయవంతమైతే తెలుగులో కూడా సల్మాన్ ఖాన్ ఇమేజ్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Next Story