Salman Khan: యుద్ధంపై సల్మాన్ ఖాన్ షాకింగ్ పోస్ట్.. ఇప్పుడే నిద్ర లేచావా అంటూ దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు..

by Mallepaka Hamsa |   (  Updated:2025-05-12 17:23:34  IST  )

భారత్- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు గత మూడు రోజులనుంచి తీవ్రంగా ఉన్నాయి. దీంతో ఇరు దేశాల్లోని ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు.

Salman Khan: యుద్ధంపై సల్మాన్ ఖాన్ షాకింగ్ పోస్ట్.. ఇప్పుడే నిద్ర లేచావా అంటూ దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు..
X

దిశ, సినిమా: భారత్- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు గత మూడు రోజులనుంచి తీవ్రంగా ఉన్నాయి. దీంతో ఇరు దేశాల్లోని ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. అయితే గత నెల పహల్గాంలో పర్యాటకులపై జరిగిన దాడి భారత్ ప్రజలను ఆగ్రహానికి గురి చేసిన విషయం తెలిసిందే. ఈక్రమంలోనే భారతీయులు ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్‌ను చిత్తు చిత్తు చేశారు. రెండు దేశాల మధ్య దాడులు, ప్రతిదాడులు ఎక్కువయ్యాయి. దీంతో శనివారం అనూహ్యంగా భారత్ పాక్ దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి. ఇక పరిస్థితులు చక్కపడతాయ్ అని అంతా అనుకున్నారు. ఈనేపథ్యంలోనే పాక్ తన వంకర బుద్దిని చూపించింది.

మళ్లీ కాల్పులు జరపడంతో భారతీయ ఆర్మీ చాకచక్యంగా వ్యవహరించి పాక్ దాడిని ఎదుర్కొంది. ప్రస్తుతం కాస్త ఉద్రిక్తత పరిస్థితులు తగ్గాయి. ఇదిలా ఉంటే.. భారత్- పాక్ కాల్పుల విరమణ ఒప్పందంపై సోషల్ మీడియాలో భిన్న రకాల స్పందనలు వినిపిస్తున్నాయి. ఇక దీనిపై తమ అభిప్రాయాలను తెలుపుతూ నెటిజన్లతో పాటు సినీ సెలబ్రిటీలు పోస్టులు పెడుతున్నారు. తాజాగా, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్(Salman Khan) కాల్పుల విరమణపై షాకింగ్ ట్వీట్ చేసి ట్రోల్స్‌కు గురవుతున్నారు. ‘‘కాల్పుల విరమణ దేవుడికి ధన్యవాదాలు’’ అని రాసుకొచ్చాడు.

ఇక అది చూసిన నెటిజన్లు కొందరు షాక్ అవుతుండగా.. మరికొందరు ఆపరేషన్ సిందూర్ మొదలుపెట్టినప్పుడు సైలెంట్‌గా ఉండి.. సీజ్ ఫైర్‌పై స్పందించావు ఇప్పుడే నిద్ర లేచావా అని అంటున్నారు. అంతేకాకుండా అప్పుడు లేవని నోరు ఇప్పుడెందుకు లేస్తుందని ఫుల్ ఫైర్ అవుతున్నారు. దీంతో సల్మాన్ ఖాన్ పోస్ట్ నిమిషాల్లోనే డిలీట్ చేశాడు. అయినప్పటికీ ఆయన పోస్ట్ స్క్రీన్ షార్ట్ తీసిన నెటిజన్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఒక స్టార్ హీరో అయిండి ఇదేనా నీ పని అని అంటున్నారు.

Next Story