- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సల్మాన్ ఖాన్ తండ్రి సలీం ఖాన్‌కు అస్వస్థత.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు
బాలీవుడ్ బాద్‌షా, కండల వీరుడు సల్మాన్ ఖాన్ తండ్రి సలీం ఖాన్ ఇవాళ మధ్యాహ్నం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

X
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ దిగ్గజ రచయిత, సల్మాన్ ఖాన్ తండ్రి సలీం ఖాన్ తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ఈ మేరకు ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన బాంద్రాలోని లీలావతి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సలీం ఖాన్‌కు వైద్యులు ఐసీయూ (ICU)లో చికిత్సను అందిస్తున్నారు. షూటింగ్‌లో ఉన్న సల్మాన్ ఖాన్‌కు విషయం తెలియగానే ఆసుపత్రికి చేరుకున్నారు. అయితే, సలీం ఖాన్ అనారోగ్యానికి గల కారణాలపై ఆసుపత్రి యాజమాన్యం, సల్మాన్ కుటుంబం ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్‌తో పాటు ఆసుపత్రిలో ఆయన బావ అతుల్ అగ్నిహోత్రి, ఇతర కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. మరోవైపు బాలీవుడ్ సినీ ప్రముఖులు, సలీం ఖాన్ అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా ప్రార్థిస్తున్నారు.
Next Story






