Salman Khan: ఇక నుంచి నా జీవితంలో అలాంటివి ఉండకూడదు అనుకుంటున్నాను.. స్టార్ హీరో షాకింగ్ కామెంట్స్

by Chukka Sudharani |

బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సికందర్’

Salman Khan: ఇక నుంచి నా జీవితంలో అలాంటివి ఉండకూడదు అనుకుంటున్నాను.. స్టార్ హీరో షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సికందర్’ (Sikander). భారీ అంచనాల మధ్య ఈ మూవీ మార్చి 30న విడుదల కానుంది. దీంతో ప్రమోషన్స్‌(Promotions)లో జోరు పెంచిన చిత్ర బృందం వరుస ఇంటర్యూస్‌లో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా తాజాగా మీడియాతో ముచ్చటించిన సల్మాన్ ఖాన్ నెగిటివిటీ(Negativity)పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. ‘ఈ సినిమా కాంట్రవ‌ర్సీ అవుతుంద‌ని బయట టాక్ నడుస్తుంది.. మీరు ఏం అంటారు’ అని రిపోర్టర్ ప్రశ్నంచాడు.

దీనిపై సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ.. ‘ నేను కాంట్రవ‌ర్సీల‌(controversies)కు దూరంగా ఉంటాను. ఎందుకంటే నా జీవితంలో ఇప్పటికే చాలా కాంట్రవ‌ర్సీల‌ను ఎదుర్కొన్నాను. ఎన్నో వివాదాలను, నెగిటివిటీని చూశాను. ఇక‌నుంచైన నా ఈ జీవితంలో ఎలాంటి వివాదాలు, కాంట్రవర్సీలు, నెటిగివిటీలు లేకుండా ఉండాలని కోరుకుంటున్నా. అలాగే కాంట్రవ‌ర్సీలతో ఏ సినిమా కూడా హిట్ అందుకోదు’ అంటూ చెప్పుకొచ్చాడు. కాగా.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ (AR Murugadoss) ‘సికందర్’ సినిమాకు దర్శకత్వం వహించగా.. ఇందులో రష్మిక మందన్న(Rashmika Mandanna), కాజల్ అగర్వాల్(Kajal Aggarwal) హీరోయిన్స్‌గా, సత్యరాజ్ (Satyaraj) కీలక పాత్రలో నటిస్తున్నాడు. నడియాద్వాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సాజిత్ నడియాద్వాలా నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీ నుంచి ప్రతి అప్‌డేట్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకోగా.. సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

Next Story