- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సల్మాన్ ఖాన్ ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ ఫస్ట్ లుక్ రిలీజ్
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan) త్వరలో ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ (Battle of Galwan) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు.

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan) త్వరలో ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ (Battle of Galwan) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి సల్మాన్ ఖాన్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో సల్మాన్ ముఖంపై రక్తంతో కనిపిస్తూ ఫెన్సింగ్ వైర్ కట్టిన కర్రను చేతిలో పట్టుకుని సీరియస్ లుక్‌లో దర్శనమిచ్చి.. ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. కాగా.. అపూర్వ లఖియా (Apoorva Lakhiya) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా.. గల్వాన్ లోయలో భారతదేశం, పాకిస్థాన్ జవాన్ల మధ్య జరిగిన ఘర్షణ నేపథ్యంలో తెరకెక్కినట్లు తెలుస్తుంది. ఇందులో సల్మాన్ ఖాన్ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. అంతే కాకుండా ఈ సినిమా కోసం సల్మాన్ తన లుక్‌ను మొత్తం చేంజ్ చేసుకుంటున్నట్లు టాక్. యుద్ధ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ కోసం సన్నగా, ఫిట్‌గా అయ్యేందుకు మరింత కృషి చేస్తున్నాడట మన బాలీవుల్ హీరో. కాగా.. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో అనౌన్స్ చేయనున్నట్లు తెలిపారు మేకర్స్.






