- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అంత జరిగిన తర్వాత కూడా టాక్సీలో తిరుగుతున్న సల్మాన్ ఖాన్..(Video Viral)
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రస్తుతం ‘సికందర్’ సినిమాలో నటిస్తున్నారు...

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్(Salman Khan) ప్రస్తుతం ‘సికందర్’(Sikandar) సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ముంబై(Mumbai)లో జరుగుతోంది. అయితే ఆయనకు సంబంధించిన వీడియో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. సల్మాన్ ఖాన్ కాళీ-పీలీ టాక్సీ(Taxi)లో ప్రయాణిస్తున్నట్లు ఈ వీడియోలో ఉంది. సల్మాన్ ఖాన్ తన మనుషులతో కలిసి కాళీ-పీలీ టాక్సీలో దిగి సినిమా షూటింగ్‌కు వెళ్లారు. ఈ సమయంలో ఊర మాస్ చొక్కా, జీన్స్ ధరించి ఆయన కనిపించారు. అయితే ఈ వీడియోను చిత్ర యూనిట్‌నే లీక్ చేసినట్లు తెలుస్తోంది. సల్మాన్ భద్రతా కారణాల దృష్ట్యా షూట్‌కు సంబంధించిన ప్రదేశాన్ని వెల్లడించలేదు. కానీ సల్మాన్ ఖాన్ మాస్ లుక్ అభిమానుల్లో ఆసక్తిని రేపింది.
కాగా కృష్ణ జింకల కేసు నుంచి సల్మాన్, బిష్టోయ్ గ్యాంగ్ మధ్య వైర్యం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే సల్మాన్ ప్రాణాలతో ఉండాలంటే రూ. 5 కోట్లు ఇవ్వాలని ఇటీవల బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరించింది. దీంతో సల్మాన్ ఖాన్‌తో పాటు ఆయన ఇంటి వద్ద పోలీసులు భద్రత పెంచారు. దీంతో ఆయన సినిమా షూటింగుల్లో పాల్గొంటున్నారు. తాజాగా కూడా వెళ్లాడు.. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.






