- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Salman Khan: ఆర్మీ ఆఫీసర్‌గా నటించబోతున్న సల్మాన్ ఖాన్.. అంచనాలను పెంచుతున్న ట్వీట్
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్(Salman Khan), అపూర్వ లఖియా (Apoorva Lakhiya)కాంబినేషన్‌లో ఓ భారీ ప్రాజెక్ట్ చేయనున్నట్లు సమాచారం.

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్(Salman Khan), అపూర్వ లఖియా(Apoorva Lakhiya) కాంబినేషన్‌లో ఓ భారీ ప్రాజెక్ట్ చేయనున్నట్లు సమాచారం. అయితే ఈ మూవీ ‘ఇండియాస్ మోస్ట్ ఫియర్‌లెస్-3’ నవల ఆధారంగా తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ఇది 2020 గాల్వన్ వ్యాలీ సంఘర్షణ నేపథ్యంలో సాగుతుంది. అయితే ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ ఆర్మీ ఆఫీసర్‌గా నటించనున్నట్లు టాక్. ఇక ఇందులో సల్మాన్‌తో పాటు మరో ముగ్గురు యంగ్ హీరోలు నటించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ జూలై నుంచి ప్రారంభించనున్నారు. 70 రోజులపాటు లడఖ్‌లో జరగనున్నట్లు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఇక ఇందుకు సంబంధించిన పలు పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచుతున్నాయి. ఇటీవల జమ్మూకాశ్మీర్‌లో అమాయకపు పర్యాటకులపై ఉగ్రదాడి జరగ్గా భారత్ ప్రతీకారంగా ఆపరేషన్ సిందూర్ మొదలెట్టిన విషయం తెలిసిందే. పాకిస్తాన్‌ను చిత్తు చిత్తు చేసిన భారత్ ఆర్మీపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపించారు. ఇందులో కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇక ఈక్రమంలోనే సల్మాన్ ఖాన్ ఆర్మీ ఆఫీసర్‌గా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. లఖియా చెప్పిన స్టోరీ నచ్చడంతో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన విడుదల కావాల్సి ఉంది.






