ఆ పని చేస్తూ కనిపించిన సల్మాన్ ఖాన్.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో.. నెటిజన్ల రియాక్షన్ ఏంటంటే?

by Mallepaka Hamsa |

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్(Salman Khan) 90sలో సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.

ఆ పని చేస్తూ కనిపించిన సల్మాన్ ఖాన్.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో.. నెటిజన్ల రియాక్షన్ ఏంటంటే?
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్(Salman Khan) 90sలో సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఎన్నో చిత్రాల్లో నటించిన ఆయన బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సాధించి బాక్సాఫీసును షేక్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. విభిన్న కథలతో ప్రేక్షకులను అలరించిన ఆయన 60 ఏళ్లు వచ్చినప్పటికీ పెళ్లి చేసుకోకుండా స్టిల్ బ్యాచ్‌లర్‌గానే లైఫ్‌ను లీడ్ చేస్తున్నాడు. అయితే సల్మాన్ ఖాన్‌కు గత కొద్ది రోజుల నుంచి బ్యాడ్ టైమ్ నడుస్తుందని చెప్పాలి. ఆయన 2023లో చేసిన రెండు సినిమాలు బాక్సాఫీసు వద్ద రాణించలేకపోయాయి. ఇక ఇటీవల వచ్చిన ‘సికందర్’ (Sikander)కూడా విజయాన్ని సాధించలేకపోయింది. సల్మాన్ ఖాన్ మూడు డిజాస్టర్లు కావడంతో కాస్త గ్యాప్ తీసుకున్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా, సల్మాన్ ఖాన్‌కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరినీ షాక్‌కు గురి చేస్తోంది. ఇక ఈ వీడియోను ఆయన ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఇందులో ఆయన బ్లాక్ బెర్రీ చెట్టు టకా టకా ఎక్కడంతో పాటు కొమ్మలను ఊపి పండ్లను రాల్పాడు. దీంతో కొంతమంది కింద ఓ జాలిని పట్టుకుని ఆయన రాల్పుతున్న పండ్లను కలెక్డ్ చేశారు. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. సల్మాన్ 60 ఏళ్లలో కూడా అంత ఫాస్ట్‌గా చెట్టు ఎక్కడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దీంతో కొంతమంది హ్యాండ్సమ్‌గా ఉన్నారని కామెంట్లు చేస్తున్నారు. అలాగే సల్మాన్ వీడియోను నెట్టింట వైరల్ చేస్తున్నారు.

Next Story