Sakutumbanam: రేషన్ కార్డుతో టీజర్ అప్డేట్.. నవ్వులు పూయిస్తున్న పోస్టర్

by Chukka Sudharani |

మేఘా ఆకాష్ (Megha Akash), రామ్ కిరణ్ (Ram Kiran) జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సకుటుంబానాం’ (Sakutumbanam).

Sakutumbanam: రేషన్ కార్డుతో టీజర్ అప్డేట్.. నవ్వులు పూయిస్తున్న పోస్టర్
X

దిశ, సినిమా: మేఘా ఆకాష్ (Megha Akash), రామ్ కిరణ్ (Ram Kiran) జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సకుటుంబానాం’ (Sakutumbanam). డైరెక్టర్ ఉదయ్ శర్మ దర్శకత్వంలో హెచ్‌.మహాదేవ్‌ గౌడ, హెచ్‌.నాగరత్నం నిర్మిస్తున్న ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. వినోదం, ఫ్యామిలీ సెంటిమెంట్‌ నేపథ్యంలో రాబోతున్న ఈ చిత్రంలో సీనియర్ నటులు రాజేంద్రప్రసాద్‌ (Rajendra Prasad), బ్రహ్మానందం (Brahmanandam) ప్రధాన పాత్రలు పోషించారు.

ఫుల్ ఫ్యామిలీ డ్రామగా తెరకెక్కుతోన్న ఈ మూవీ నుంచి ఇప్పటికే వచ్చిన అప్డేట్స్ ఆకట్టుకోగా.. తాజాగా టీజర్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ‘అది దా సారు & సకుటుంబానాం టైటిల్ ట్రాక్ తర్వాత.. తదుపరి బిగ్ డ్రాప్ కోసం సమయం ఆసన్నమైంది.. ఈ శనివారం ఉదయం 11:07 గంటలకు టీజర్ విడుదల కాబోతుంది’ అని తెలుపుతూ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ ఓ ఫ్యామిలీ రేషన్ కార్డు ఫొటోలా కనిపిస్తుండగా.. అందులో ఒక్కొక్కరు ఒక్కో యాంగిల్‌లో చూడటంతో ఫన్నీగా వైరల్ అవుతోంది.

Tweet

Next Story