- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మోసపోయిన హాట్ బ్యూటీ సాక్షి...పనీర్ అడిగితే చికెన్ ఇచ్చారు !
పనీరు ఆర్డర్ చేస్తే... చికెన్ పంపించారని హాట్ బ్యూటీ సాక్షి అగర్వాల్ సీరియస్ అయ్యారు. పంపించిన రెస్టారెంట్ పై..

దిశ, వెబ్ డెస్క్: పనీరు ఆర్డర్ చేస్తే... చికెన్ పంపించారని హాట్ బ్యూటీ సాక్షి అగర్వాల్ సీరియస్ అయ్యారు. పంపించిన రెస్టారెంట్ పై.. సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టి నిలదీశారు సాక్షి అగర్వాల్. ఈ సంఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. తమిళనాడు సాక్షి అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాల్లోనే కాకుండా... నిత్యం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటారు ఈ అందాల తార.
హాట్ అందాలు ఆరబోస్తూ.. రచ్చ చేస్తూ ఉంటారు. అయితే అలాంటి తమిళ నటి సాక్షి అగర్వాల్ కు ఎవరు ఊహించని సంఘటన ఎదురైంది. జీవితంలో మాంసాహారం తినని... ఆమెతో స్విగ్గి చికెన్ కూడా తినిపించేశారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. బాగా ఆకలిగా ఉందని... ఓ ప్రముఖ రెస్టారెంట్ నుంచి పనీర్ ఆర్డర్ పెట్టుకున్నారు తమిళ నటి సాక్షి అగర్వాల్.
అయితే ఆ స్విగ్గి ఆర్డర్.. ఆమె కొంపముంచింది. ఇప్పటి వరకు మాంసాహారాలు తినని... ఆమెతో చికెన్ తినిపించారు. ఆ ఆర్డర్ లో పనీర్ ముక్కలతో పాటు చికెన్ ముక్కలు దర్శనం ఇచ్చాయట. దీంతో ఆ రెస్టారెంట్ పై తీవ్ర ఆగ్రహించారు సాక్షి. ఎప్పుడూ చికెన్ తినని తనతో... ఇప్పుడు తినిపించారని ఫైర్ అయ్యారు. హిందువుల మనోభవాలు దెబ్బతినేలా రెస్టారెంట్ వ్యవహరించిందని ఆగ్రహిస్తున్నారు.






