'ఘాటి'.. ఫస్ట్ సాంగ్.. క్యూట్ హగ్స్ తో అనుష్క రచ్చ !

by velandi.Saikiran |   (  Updated:2025-08-01 03:46:55  IST  )

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ( Anushka Shetty) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సూపర్ సినిమాతో తెలుగు

ఘాటి.. ఫస్ట్ సాంగ్.. క్యూట్ హగ్స్ తో అనుష్క రచ్చ !
X

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ( Anushka Shetty) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సూపర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనఈ బ్యూటీ.. దాదాపు 20 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఎక్కడ కూడా.. వెనక్కి తగ్గకుండా ఇప్పటివరకు అగ్రశ్రేణి హీరోయిన్ గా అనుష్క శెట్టి ఉన్నారు. అయితే చాలా రోజుల తర్వాత మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు లేడీ ఓరియంటెడ్ సినిమాతో వస్తున్నట్లు తెలుస్తోంది.

అనుష్క ప్రస్తుతం చేస్తున్న సినిమా ఘాటి (Ghaati). క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో.. అనుష్క లీడ్ రోల్ లో ఈ సినిమా వస్తోంది. ఇక ఇందులో విక్రమ్ ప్రభు, జగపతిబాబు, రమ్యకృష్ణ కీలక పాత్రలలో కనిపించనున్నారు. అయితే తాజాగా ఈ సినిమా నుంచి మొదటి సాంగ్ రిలీజ్ చేశారు. సైలోరే అనే లిరికల్ వీడియో సాంగ్ ను తాజాగా రిలీజ్ చేస్తూ చిత్ర బృందం కీలక ప్రకటన చేసింది.

ఇక ఇందులో అనుష్క శర్మ అలాగే... విక్రమ్ ప్రభు మధ్య కొన్ని రొమాంటిక్ సీన్స్ కూడా కనిపించాయి. వీళ్ళిద్దరూ ఈ సినిమాలో లవర్స్ లేదా భార్యాభర్తలు గా కనిపించే అవకాశాలు ఉన్నాయి. అలాగే చాలా రోజుల తర్వాత చీర కట్టులో అనుష్క శెట్టి మెరిసింది. దీంతో ఈ పాట జనాల్లోకి గట్టిగానే వెళ్తుంది.

Video Link

Next Story