- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సైఫ్ అలీఖాన్ హెల్త్ రిపోర్ట్ విడుదల.. షాకింగ్ విషయాలు వెల్లడించిన వైద్యులు?
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్(Saif Ali Khan) పై దుండగుడు దాడి చేసిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

దిశ,వెబ్‌డెస్క్: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్(Saif Ali Khan) పై దుండగుడు దాడి చేసిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ దాడిలో సైఫ్ శరీరం పై మొత్తం ఆరు చోట్ల తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన కుటుంబ సభ్యులు ఆయనను చికిత్స నిమిత్తం లీలావతి ఆస్పత్రి(Lilavati Hospital)కి తరలించారు. ఈ క్రమంలోనే ఆసుపత్రి వైద్యులు సైఫ్ అలీఖాన్ ఆరోగ్య పరిస్థితిపై తాజాగా హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. అయితే ఆ దుండగుడు బలంగా కత్తితో పొడవడంతో వెన్నెముక పక్కన గాయమైందని వైద్యులు హెల్త్ బులెటిన్ లో తెలిపారు.
సైఫ్ వారం రోజుల పాటు జాగ్రత్తగా ఉండాలని, వెన్నెముకలో ఫ్లూయిడ్ లీకేజీని అరికట్టగలిగామని, సైఫ్ వెన్నెముకకు ఎలాంటి గాయం కాలేదని, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. ఈ మేరకు తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ‘‘సైఫ్ ఆరోగ్యం మెరుగుపడుతోందని వైద్యులు తెలిపారు. అలాగే నడవగలుగుతున్నారు. నడుస్తున్నప్పుడు తీవ్రమైన నొప్పి లేదా ఇతర ఇబ్బందులను ప్రస్తుతానికి గుర్తించలేదు. ఆయన్ని ఐసీయూ నుంచి ప్రత్యేక గదిలోకి మారుస్తాం. వెన్ను నుంచి కత్తిని తొలగించాం. గాయాల కారణంగా ఇన్ఫెక్షన్ అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంది. అందుకే ఆయనకు కొంతకాలం విశ్రాంతి సూచించాం కొన్ని రోజుల తర్వాత పరిస్థితిని చూసి డిశ్చార్జ్ చేస్తాం’’ అని వైద్యులు తెలిపారు.






