- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Saif Ali Khan: ‘ఇప్పటికీ కూడా నేను సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవాలని అనుకోవట్లేదు.. హీరో సెన్సేషనల్ కామెంట్స్
బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్(Bollywood hero Saif Ali Khan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్(Bollywood hero Saif Ali Khan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ హీరో రీసెంట్ గా గుర్తు తెలియని దుండగుడి చేతిలో కత్తిపోటుకు గురైన విషయం తెలిసిందే. సైఫ్ అలీఖాన్ ఇంట్లో దొంగతనానికి వచ్చిన క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుందని సోషల్ మీడియా టాక్. అయితే తాజాగా సైఫ్ అలీఖాన్ ఓ ఇంటర్వ్యూకు హాజరై.. ఈ దాడి గురించి మాట్లాడారు. భద్రతపై ప్రశ్న ఎదురవ్వగా.. ఇప్పటికీ కూడా నేను సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవాలని అనుకోవట్లేదని సైఫ్ వెల్లడించారు. ఎందుకంటే సెక్యూరిటీపై తనకు నమ్మకం లేదని తెలిపారు.
ఈ ఘటన జరిగినాక చాలా మంది అన్నారు భద్రత (Safety)ఏర్పాటు చేసుకోవాలని.. కానీ నాకు నమ్మకం లేదని సమాధానమిచ్చానని అన్నారు. నాకు ఎలాంటి సెక్యూరిటీ వద్దని ఇంటర్వ్యూలో తేల్చి చెప్పారు. ఈ ఇష్యూను ఒక పీడకలగా భావిస్తున్నానని.. అనంతరం కూడా నాకు సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవాలని అనుకోలేదని తెలిపారు. ప్రస్తుతం నేను బానే ఉన్నానని.. దాడి పొరపాటున జరిగిందని సైఫ్ చెప్పుకొచ్చారు. ఈ ఘటన ఏం నా లైఫ్ ను ఛేంజ్ చేయదని అన్నారు. దొంగతనానికి వచ్చిన పర్సన్ ఈ దాడి చేశాడు కానీ.. కావాలని చేయలేదని పేర్కొన్నారు.
ఇటీవల సైఫ్ అలీఖాన్ ఓ ఇంటర్వ్యూలో ఈ దాడి గురించి మాట్లాడిన విషయం తెలిసిందే. కత్తిపోటుకు గురయ్యాక.. కరీనా(Kareena Kapoor) చాలా ఆందోళన చెందిదని అన్నారు. తనకు ధైర్యం చెప్పానని తెలిపారు. అలాగే కొడుకు కూడా నాన్న మీరు చనిపోతారా? అని అడిగాడని.. అలా ఏం జరగదని అతడికి చెప్పానని సైఫ్ అలీఖాన్ వివరించారు.






