'క' దర్శకులతో సాయిదుర్గ తేజ్

by Pulgam srinivas |

‘క’ సినిమా దర్శకులు సుజిత్–సందీప్ దర్శకత్వంలో సాయిదుర్గ తేజ్ తదుపరి చిత్రం తెరకెక్కనున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన రేపు వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

క దర్శకులతో సాయిదుర్గ తేజ్
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో సాయిదుర్గ తేజ్ ప్రస్తుతం ‘సంబరాల ఏటిగట్టు’ (SYG) చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ షూటింగ్ పూర్తికానున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, ఈ నటుడు తన తదుపరి ప్రాజెక్ట్‌కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ‘క’ చిత్రంతో దర్శకులుగా పరిచయం అయిన సుజిత్–సందీప్ దర్శకత్వంలో సాయిదుర్గ తేజ్ తన తదుపరి సినిమాను చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కాంబినేషన్‌కు సంబంధించిన కథా చర్చలు పూర్తయ్యాయని, ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన రేపు వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక ‘క’ చిత్రం మంచి విజయాన్ని సాధించిన నేపథ్యంలో ఈ దర్శకుల తదుపరి ప్రాజెక్ట్‌గా రాబోయే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొనే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

Next Story