సూపర్ హిట్ కాంబోలో సాయి పల్లవి

by Chukka Sudharani |

విజయ్ సేతుపతి, మణిరత్నం మరోసారి జతకట్టబోతున్నారు. ఈ సినిమాలో నేచురల్ ప్టార్ హీరోయిన్ సాయి పల్లవి కన్ఫామ్ అయిందని ఫిల్మ్ నగర్ టాక్.

సూపర్ హిట్ కాంబోలో సాయి పల్లవి
X

దిశ, సినిమా: సూపర్ హిట్ కాంబో విజయ్ సేతుపతి, మణిరత్నం మరోసారి జతకట్టబోతున్నారు. లైకా ప్రొడక్షన్స్ సమర్పణలో మద్రాసు టాకీస్ బ్యానర్‌పై రూపొందిన ‘చెక్క చివంద వానమ్’ అనే చిత్రంతో ఇప్పటికే ఈ కాంబో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ మూవీ తెలుగులో ‘నవాబ్’ పేరుతో విడుదలైంది. అయితే ఇప్పుడు విజయ్ సేతుపతి, మణిరత్నం కాంబోలో రాబోతున్న ఈకొత్త సినిమా మునుపటి ప్రాజెక్ట్ కంటే పూర్తిగా భిన్నంగా ఉంటుందని ఇప్పటికే సేతుపతి పంచుకున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా కంప్లీట్ అయినట్లు తమిళ వర్గాల్లో టాక్ నడుస్తుంది. దీంతో ఈ చిత్రం ఎప్పుడు పట్టాలెక్కనుందని ఆడియన్స్ చూస్తుండగా.. తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ బజ్ నెట్టింట దర్శనమిచ్చింది. ఇందులో ఫిమేల్ లీడ్ కోసం నేచురల్ బ్యూటీ సాయిపల్లవిని సంప్రదించారని సమాచారం. కథ నచ్చడంతో సాయి పల్లవి కూడా ఈ ప్రాజెక్ట్ ఓకే చేసిందని తెలుస్తుండగా.. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.

Next Story