- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారీగా రెమ్యూనరేషన్ పెంచేసిన సాయి పల్లవి.. ఎంత తీసుకుంటోందంటే?
సౌత్ స్టార్ హీరోయిన్ సాయి పల్లవి (Sai Pallavi) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

దిశ, వెబ్ డెస్క్: సౌత్ స్టార్ హీరోయిన్ సాయి పల్లవి (Sai Pallavi) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూనే యాక్టింగ్, డ్యాన్స్‌తో తనకంటూ ప్రత్యేకమైన అభిమానులను సంపాదించుకున్నారు. ఆమె సెలెక్ట్ చేసుకునే పాత్రలు కూడా అంతే అద్భుతంగా ఉంటాయి. అందుకే స్క్రీన్‌పై సాయి పల్లవి కనిపిస్తే చాలు.. స్టార్ హీరోల రేంజ్‌లో ఫ్యాన్స్ ఈలలు, గోలలతో థియేటర్లు దద్దరిల్లిపోయేలా చేస్తారు. ఇక వరుస విజయాలతో దూసుకెళ్తోన్న ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం 'తండేల్' (Tandel)తో పాటు రెండు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో సాయి పల్లవి భారీగా రెమ్యూనరేషన్ పెంచినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
గత ఏడాది దీపావళి సందర్భంగా రిలీజ్ అయిన 'అమరన్' మూవీ బాక్సాఫీసు వద్ద భారీ విజయాన్ని సాధించింది. శివ కార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటించిన ఈ మూవీ భారీ కలెక్షన్లు రాబట్టింది. అయితే 'అమరన్' వరకు తక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్న సాయి పల్లవి 'తండేల్' మూవీకి మాత్రం భారీగా పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది. 'అమరన్' చిత్రానికి రూ. 3 కోట్ల పారితోషికం అందుకున్న ఈ భామ..'తండేల్' 'సినిమాకు రూ. 5 కోట్లు ఛార్జ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో తన కెరీర్‌లో తీసుకున్న ఎక్కువ పారితోషకం ఇదేనని, ఎన్నో సినిమాలు చేసినా ఏ సినిమాకీ ఇంత ఎక్కువ మొత్తంలో ఛార్జ్ చేయలేదని తెలుస్తోంది.
అయితే, సాయిపల్లవి సన్నిహితులు మాత్రం ఆమెకు రెమ్యూనరేషన్ పట్టింపులు అస్సలు ఉండవని చెబుతున్నారు. సినిమాల విషయంలో మంచి కథలు, పాత్రలకే అధిక ప్రాధాన్యం ఇస్తుందని, పారితోషికం విషయంలో డిమాండ్ చేసిన సందర్భాలు లేవని ఇండస్ట్రీ వర్గీయులు అంటున్నారు. 'పడి పడి లేచె మనసు' సినిమా ఫెయిల్యూర్ కావడంతో ఆమె తన పారితోషికాన్ని కూడా వదులుకుందని రికార్డు కూడా సాయిపల్లవికి ఉంది.
ఇక నాగ చైతన్య (Naga Chaitanya), సాయి పల్లవి (Sai Pallavi) జంటగా డైరెక్టర్ చందూ మోండేటి తెరకెక్కించిన తాజా చిత్రమే 'తండేల్'. గతేడాది విడుదల కావాల్సిన ఈ సినిమా.. ఎన్నో వాయిదాలు పడిన తర్వాత ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇందులో సాయి పల్లవి 'బుజ్జి' పాత్రలో కనిపించనున్నారు. అయితే చైతూ, సాయి పల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీ (Love Story) సూపర్ హిట్ అవడంతో వీరిద్దరి కాంబోలో వస్తున్న రెండో సినిమా కావడంతో తండేల్ పై ఆ విధంగా కూడా అంచనాలు పెరుగుతున్నాయి.






