47 ఏళ్ల హీరోతో రొమాన్స్ చేయబోతున్న సాయి పల్లవి?.. అమ్మో వద్దే వద్దంటున్న నెటిజన్లు

by Gugulothu.Kavitha |

నేచురల్ బ్యూటీ సాయి పల్లవి(Sai PAllavi) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

47 ఏళ్ల హీరోతో రొమాన్స్ చేయబోతున్న సాయి పల్లవి?.. అమ్మో వద్దే వద్దంటున్న నెటిజన్లు
X

దిశ, వెబ్‌డెస్క్: నేచురల్ బ్యూటీ సాయి పల్లవి(Sai PAllavi) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ‘ఫిదా’(Fidaa) మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ చిన్నది ఇండస్ట్రీకి వచ్చిన అనతి కాలంలోనే మంచి ఫేమ్ తెచ్చుకుంది. ఆ తర్వాత దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. ఇక ఈ చిన్నదాని డ్యాన్స్‌కు అయితే ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే చెప్పాలి. చివరిగా ‘తండేల్’(Thandel) మూవీతో భారీ హిట్ తన ఖాతాలో వేసుకున్న ఈ నేచురల్ బ్యూటీ ప్రజెంట్ బాలీవుడ్‌లో ‘రామాయణ్’(Ramayan) మూవీలో నటిస్తోంది.

ఇందులో రణబీర్(Ranbeer Kapoor) రాముడిగా కనిపిస్తుండగా.. సాయి పల్లవి సీతగా కనిపించనుంది. అలాగే స్టార్ హీరో యష్(Yash) రావణాసురుడిగా కనిపించనున్నాడు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు సాయి పల్లవి మరో భారీ సినిమాలో సెలక్ట్ అయినట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. తమిళ్‌లో మణిరత్నం(Mani Rathnam) దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో విజయ్ సేతుపతి(Vijay sethupathi) హీరోగా నటిస్తున్నారు. ఇక హీరోయిన్‌గా సాయి పల్లవిని ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. అయితే గతంలో మణిరత్నం- విజయ్ సేతుపతి కాంబోలో ‘నవాబ్’(Nawab) సినిమా వచ్చిన సంగతి తెలసిందే.

దీంతో మరోసారి ఈ కాంబో రిపీట్ కానుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన న్యూస్ నెట్టింట వైరల్‌గా మారగా.. దీనిపై నెటిజన్లు విజయ్ పక్కన సాయి పల్లవి డాటర్‌గా కనిపిస్తుందని, వారిద్దరికీ అస్సలు సెట్ కాదని తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మరి రియల్‌గా ఇందులో సాయి పల్లవి విజయ్ సరసన నటిస్తుందా లేదా మరేదైనా రోల్ చేస్తుందా అనేది తెలియాల్సి ఉంది.

Next Story