Sai Pallavi: కీలక నిర్ణయం తీసుకున్న సాయి పల్లవి.. అవసరమా అంటున్న నెటిజన్లు?

by Hamsa |
Sai Pallavi: కీలక నిర్ణయం తీసుకున్న సాయి పల్లవి.. అవసరమా అంటున్న నెటిజన్లు?
X

దిశ, సినిమా: టాలీవుడ్ నేచురల్ బ్యూటీ సాయి పల్లవి(Sai Pallavi) ‘ఫిదా’ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. ఆ తర్వాత శ్యామ్ సింగ రాయ్, లవ్ స్టోరీ వంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. ఇక గత ఏడాది ‘అమరన్’(Amaran) చిత్రంతో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేయడంతో పాటు సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఇక ఇదే ఫామ్‌తో వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతుంది. ఇటీవల సాయి పల్లవి, నాగచైతన్య(Naga Chaitanya) కాంబోలో వచ్చిన ‘తండేల్’ (Thandel)బాక్సాఫీసు వద్ద ఘన విజయాన్ని సాధించింది. అలాగే భారీ కలెక్షన్లు కూడా రాబడుతున్నట్లు సమాచారం.

ప్రస్తుతం సాయి పల్లవి భారీ ప్రాజెక్ట్ ‘రామాయణ’ (Ramayana)సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. నితీష్ తివారి దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో రణ్‌బీర్ కపూర్(Ranbir Kapoor) హీరోగా నటిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా, సాయి పల్లవి ఓ బంపర్ ఆఫర్ పట్టేసినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. కోలీవుడ్ స్టార్ హీరో శింబు (శిలంబరసన్) ‘STR-49’లో ఈ అమ్మడు ఫీమేల్ లీడ్ రోల్‌లో నటిస్తున్నట్లు టాక్. రాజ్ కుమార్ బాలకృష్ణన్(Rajkumar Balakrishnan) దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో సంతానం కమెడియన్‌గా కనిపించనున్నారు.

దీనిని డాన్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇక షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్‌లో విడుదల కానున్నట్లు సమాచారం. కాగా, శింబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన చేసిన సినిమాల్లో లిప్ లాక్ సీన్స్, రొమాంటిక్ సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయన్న విషయం తెలిసిందే. అలాగే శింభు తనతో నటించే హీరోయిన్స్‌తో రిలేషన్ కొనసాగిస్తారనే ప్రచారం కూడా ఉంది. ఇక అలాంటి హీరోతో సాయి పల్లవి నటిస్తుందని తెలుసుకున్న వారంతా ఆమెపై మండిపడుతున్నారు. అసలు సాయి పల్లవి ఇలాంటి చెత్త నిర్ణయం ఎందుకు తీసుకుందో? అని విమర్శలు చేస్తున్నారు. ఇక ఏడాదికి ఓ హిట్ అందుకుంటున్న ఆమె ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. అవసరమా అని అభిప్రాయపడుతున్నారు.

Next Story

Most Viewed