- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Sai Pallavi: సౌత్‌లో స్టార్ బ్యూటీ.. కానీ అక్కడ ఎదురుదెబ్బ
సాయి పల్లవి తాజాగా నటించిన హిందీ సినిమా ఏక్ దిన్ బాక్సాఫీస్ దగ్గర పేలవమైన ప్రదర్శన కనబరుస్తున్నట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: సౌత్‌లో సాయి పల్లవికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈమె స్టార్ హీరోలతో సమానమైన ఇమేజ్‌ను సౌత్ ఇండస్ట్రీలో సొంతం చేసుకుంది. తాజాగా నార్త్ ఇండస్ట్రీలోకి కూడా ఈ బ్యూటీ ఎంట్రీ ఇచ్చింది. ఇటీవల ఈ నటి, ఆమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ హీరోగా నటించిన ఏక్ దిన్ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రాన్ని స్వయంగా ఆమీర్ ఖాన్ నిర్మించాడు. మంచి అంచనాల నడుమ మే 1న విడుదలైన ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద పెద్ద ఎదురుదెబ్బ తగిలేలా కనిపిస్తోంది. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం దేశవ్యాప్తంగా మొదటి రోజు సుమారు 1.37 కోట్ల కలెక్షన్లు రాగా, రెండో రోజు అది ఒక కోటి వరకు పడిపోయింది. మూడో రోజు ఈ కలెక్షన్లు మరింత తగ్గినట్లు సమాచారం. దీన్ని బట్టి చూస్తే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా నిలబడే అవకాశాలు తక్కువగా ఉన్నాయని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. ఇలా సౌత్‌లో అద్భుతమైన క్రేజ్ కలిగిన సాయి పల్లవి, నార్త్‌లో తన మొదటి సినిమాతోనే భారీ అపజయాన్ని ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి.






